జనవరి 9, 2010

సరసమైన కథల పోటీ

Posted in కథల పోటీలు at 12:09 ఉద. by వసుంధర

స్వాతి వారపత్రిక జనవరి 8 (2010) సంచికలో సరసమైన కథల పోటీ ప్రకటించింది.
రూ 5000 చొప్పున 6 కథలకు మొత్తం రూ 30,000ల బహుమతులు. 
నిబంధనలు:
1. మితిమీరిన శృంగారం మంచిది కాదు.
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు.
3. కథ స్వీయ రచన, అముద్రితం- అని స్వదస్తూరీతో వ్రాసిన హామీపత్రం జతపర్చాలి.
4. అరఠావు సైజులో 8 పేజీలు మించకూడదు. కవరుమీద “సరసమైన కథలపోటీకి” అని వ్రాయాలి.
5. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపాలంటే- తగినన్ని స్టాంపులు అతికించిన కవరుపై స్వంత చిరునామా వ్రాసి జత పర్చాలి.
చిరునామా: ఎడిటర్, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002
ముగింపు తేదీ: ఫిబ్రవరి 20, 2010

Leave a Reply

%d bloggers like this: