జనవరి 9, 2010

సి.పి. బ్రౌన్-నవ్య ఉగాది కథల పోటీ

Posted in కథల పోటీలు at 12:50 ఉద. by వసుంధర

నవ్య వారపత్రిక- జనవరి 6 (2010) సంచికలో- ఉగాది కథల పోటీ ప్రకటించింది. ఈ పోటీ సి.పి. బ్రౌన్ అకాడమీ-నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ప్రథమ బహుమతి: రూ 10,000 
ద్వితీయ బహుమతి: రూ 8,000
2 తృతీయ బహుమతులు (కథ ఒక్కింటికి): రూ 5,000
11 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రూ 2,000
నిబంధనలు:
1. కథ తెలుగు వారి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి.
2. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి 500 ఏళ్లైన సందర్భంగా — ఆనాటి చారిత్రక విషయాలనిముడ్చుకున్న కథలకు ప్రత్యేక ప్రోత్సాహం.   
3. రచయిత(త్రి) పేరు, పూర్తి చిరునామా- కథతోపాటు కాక వేరే కాగితంపై వ్రాయాలి. హామీపత్రం విధిగా జతపర్చాలి.
4. అరఠావు సైజులో 10 పేజీలు, డి.టి.పి చేసిన పక్షంలో 6 పేజీలు మించకూడదు. కవరుమీద “సి.పి. బ్రౌన్ అకాడమీ-నవ్య వీక్లీ కథలపోటీకి” అని వ్రాయాలి.
5. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపబడవు.
6. బహుమతి పొందిన కథలు నవ్య వీక్లీలోనూ, సి.పి. బ్రౌన్ అకాడమీ వెలువరించే కథల సంకలనంలోనూ ప్రచురితమౌతాయి.
7. బహుమతి పొందిన కథలపై సర్వ హక్కులూ సి.పి. బ్రౌన్ అకాడమీవి. ఆ మేరకు విజేతలు కాపీరైట్ అగ్రిమెంటు వ్రాయాల్సి ఉంటుంది.
చిరునామా: నవ్య వీక్లీ, ఫ్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500 033
ముగింపు తేదీ: ఫిబ్రవరి 17, 2010

Leave a Reply

%d bloggers like this: