జనవరి 23, 2010

అమెరికాలో ఈటీవీ

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 3:48 ఉద. by వసుంధర

అమెరికానుంచి ఇండియా వచ్చినవారికి- అక్కడి ఈ టీవీ కార్యక్రమాలు మిస్ కాకుండా కొనసాగడానికి ఇంచుమించు అన్ని కార్యక్రమాలూ ఇక్కడా అందిస్తోంది ఈటీవీ. వాటి తీరుతెన్నులు చర్చిద్దాం.

వేళా పాళా: ఇండియాలోనూ అమెరికాలోనూ కార్యక్రమాల టైమింగ్సు ఒకటే. కానీ అమెరికాలో టైము ఇండియాకంటే సుమారు ఓ పూట వెనక్కి కాబట్టి- ప్రసారాలు వేర్వేరు. ప్రతి కార్యక్రమం ముందక్కడా, ఓ పూట తర్వాత ఇక్కడా ప్రసారమౌతుంది. అందువల్ల ఏ సీరియల్ ఐనా ఉత్కంఠభరితంగా ఉంటే ఇండియాలో తెలిసినవారికి ఫోన్ చేసి కథ తెలుసుకోవచ్చు. కానీ తమ సీరియల్సుపై ఈటీవీ వారికే అంత సదభిప్రాయమున్నట్లు తోచదు. గతంలో వచ్చిన శుభలేఖ, ఆడపిల్ల వంటి సీరియల్సుని చెప్పాచెయ్యకుండా మధ్యలో ఆపేసారు. వీక్షకులూ అది పట్టించుకున్నట్లు తోచదు. ప్రస్తుతం ఒకోసారి ఉపగ్రహం లింకు సమస్యో ఏమో- ఉన్నట్లుండి కార్యక్రమాలు నేరుగా ఇండియానుండే వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రిపూట ఇక్కడ సీరియల్సుకు బదులు- అక్కడి పగటి కార్యక్రమాలు వస్తాయి. ఆ పొరపాటు సవరించుకున్నాక కార్యక్రమాలు మళ్లీ ఎప్పటిలాగే వస్తాయి కానీ- మిస్ ఐన సీరియల్ భాగాలు మరి రావు. మేమిక్కడికొచ్చిన రెండు నెలల్లో ఇప్పటికి అలా 3-4 సార్లు జరిగింది. యాజమాన్యానికి బహుశా వీక్షకులనుంచి ఫిర్యాదు లేదనుకోవాలి. ఉండదని యాజమాన్యమూ భావిస్తోందనుకోవాలి.

కొత్తా పాతా: సీరియల్సు ఓ పూట ఆలస్యంగా రావడం తప్పనిసరి. కానీ వార్తలు? ఈ ఇంటర్నెట్ యుగంలో ఎప్పటి వార్తలు అప్పుడు తెలిసిపోతూనే ఉంటాయి. ఐనా వార్తలకోసం టీవీ చూడ్డం, దినపత్రికలు చదవడం మానలేం కదా! అలాంటప్పుడు ఒక్ క్రికెట్ మాచ్ ఫలితం ఇక్కడ ఉదయం 10 గంటలకి తెలిసిపోయాక- ఆ రాత్రి 9 గంటలకి ఈటీవీ వార్తల్లో- మాచ్ ఇంకా మంచి రసపట్టులో ఉందని వినడం ఏదోలా ఉంటుంది కదా! తాజా వార్తలు వినిపించలేకపోతే- ఆ స్థానాన్ని మరో కార్యక్రమంతో భర్తీ చేస్తే బాగుంటుంది కదా!

జోహార్లు: పై లోపాలు చెప్పడానికి కారణం ఈటీవీ కార్యక్రమాలపట్ల ఆసక్తి. అమెరికాలో తెలుగు కార్యక్రమాల వీక్షకులకు ఈ కార్యక్రమాలు కన్నుల పండుగ, వీనుల విందు అనడంలో సందేహం లేదు. వివిధ కార్యక్రమాల బాగోగుల గురించి క్రమంగా చర్చిద్దాం కానీ ముందుగా- ఈ కార్యక్రమాలను ఇక్కడి తెలుగువారి అందుబాటులోకి తెస్తున్న ఈటీవీకి ధన్యవాదాలు, అభినందనలు.

7 వ్యాఖ్యలు »

  1. వసుంధర గారూ, చాలా కాలం తరువాత. అంతా క్షేమమని భావిస్తాను.మీరన్నట్లు చాలా కాలంగా చానల్స్ కు నిబద్ధత లోపిస్తోంది. మధ్యంతరంగా ఎటువంటి సూచనా లేకుండా సీరియల్స్ ఆపేస్తుంటారు. మీరు చెప్పినట్లు ఆలస్యంగా ఎపిసోడ్ ప్రసారం చేయడం, వంటివిషయాలు కొద్దిమందైనా ఫీడ్ బ్యాక్ యిస్తే యేమన్నా సరి చేసుకుంటారేమో.శాటిలైట్ టైమింగ్స్ వగైరా సమస్యలేమన్నా వున్నాయేమో?…..శ్రేయోభిలాషి ……నూతక్కిరాఘవేంద్ర రావు.

    • satellite టైమింగ్ అనుకుందుకు లేదు. ఇండియాలో కూడా అంతే. శుభలేఖ, ఆడపిల్ల సీరియల్స్ అర్థాంతరంగా ఆగిపోయాయి. అవి ఆగిపోవడంవల్ల ఇటు యాజమాన్యానికీ, అటు చూసేవారికీ కూడా నష్టమేమీ లేదన్న స్థాయి వాటిది. కొత్తగా వస్తున్న వనిత టీవీలో కొన్ని కార్యక్రమాలు బాగున్నాయని చూడబోతే- వారానికో టైములో వస్తుంటే మిస్ కాక తప్పలేదు. ఇంచుమించు ఛానెల్సన్నీ వాళ్ల సరదాకోసమే తప్ప ప్రేక్షకులకోసమని అనుకుంటున్నట్లు తోచదు. మున్ముందు మరి కొన్ని అనుభవాలు తెలుపగలం. మీరు కూడా మీ అనుభవాలు అక్షరజాలం పాఠకులతో పంచుకోవలసిందిగా మనవి. ఏదేమైనా టీవీ మనకి చౌకలో వినోదం అందించే గొప్ప సాధనం. ఛానెల్సు సేవలు మెరుగుపర్చడానికి సహకరించే స్థ్హాయిలో ఉన్న ప్రేక్షకులది ఇంకా స్వల్ప శాతమే!


Leave a Reply

%d bloggers like this: