ఫిబ్రవరి 10, 2010

ఆంధ్రభూమి కథల పోటీ ఫలితాలు

Posted in Uncategorized at 2:08 ఉద. by వసుంధర

పత్రికకు స్వర్ణోత్సవం సందర్భంగా ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ఆంధ్రభూమి వారపత్రికలో (ఫిబ్రవరి 11, 2010) వచ్చాయి.
పోటీకి వచ్చిన కథలు రాసిలోనే తప్ప వాసిలో రాణించలేదని నిర్వాహకుల అభిప్రాయం. ప్రథమ బహుమతికి అర్హమైన కథ లభించక పోయినా మిగతా బహుమతులను పెంచడం ప్రశంసనీయం. విజేతల వివరాలివి:
రెండవ బహుమతి (10,000)
 సింగరాజు రమాదేవి
2 మూడవ బహుమతులు (చెరి 3,000)
 సింహప్రసాద్
 లత కందికొండ
4 ప్రత్యేక బహుమతులు (తలా 1,000)
 దోరవేటి
 కె. వరలక్ష్మి
 ఆకురాతి భాస్కరచంద్ర
 పి.ఎస్. నారాయణ
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితాకి లింకు 
http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/story-results-067
పై రచయితలందరికీ అభినందనలు. విజేతలకు ప్రత్యేకాభినందనలు. ఈ సమాచారాన్ని మాకు అందజేసిన ప్రముఖ రచయిత్రి వారణాసి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు.

1 వ్యాఖ్య »

  1. ఈ మధ్య కథలపొటీ ఫలితాలు చూస్తుంటే నాకు పుట్టిన రెండు శంకలు –

    1. ప్రధమ బహుమతికి అర్హమైన కథలు లేవు అనే ప్రకటన చాలా తరచుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం అనుబంధాలు (ఈనాడు కథల పోటీలో కూడా ప్రథమ బహుమతి లేదు), చిన్న పత్రికలు. అయితే రాసికేం కొదువలేదని వక్కాణింపులూ వున్నాయి.

    2. ఇక రెండొవది విజేతలుగా అవే పేర్లు మార్చి మార్చి కనపడుతున్నాయి. (రచయితలపైన ,వారి కథలపైన, వాటి అర్హతలపైనా నాకెలాంటి అనుమానం లేదు) చెప్పొచ్చేదేమిటంటే కొందరే కథకులు తరచుగా విజేతలుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఉత్తమ కథకులు కేవలం పోటిలకి మాత్రమే వ్రాస్తుండటం ఒక కారణం కావచ్చు.

    పైన రెండు అనుమానాలు కలిపి చదివితే వచ్చే మూడో అనుమానం – ఇలాంటి బహుమతి పొందే రచయితలు కేవలం పెద్ద పత్రికలకి “మంచి” కథలు పంపుతూ, మిగిలిన చిన్న పత్రికలకి (పెద్దా చిన్నా వారిచ్చే పారితోషికంగా గమనించాలి) ఒక మోస్తరు కథలని పంపుతున్నారా? అలాగైతే స్వాతిలొనో మరో “పెద్ద” పత్రికలో వచ్చిన సాధారణ ప్రచురణ కథ, ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చే రెండొవ బహుమతి కథ కన్నా “మంచి” కథయ్యే అవకాశం లేదా?

    ఇలాంటి తలతిక్క ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో పట్టించుకోకుండా సమాధానం పదుగురికి వుపయోగపడుతుందనుకుంటే చెప్పండి.


Leave a Reply

%d bloggers like this: