ఫిబ్రవరి 20, 2010

వెన్నెల దా.సు అస్తమయం

Posted in సాహితీ సమాచారం at 5:32 ఉద. by వసుంధర

ఆబాలగోపాలాన్నీ అలరించిన చందమామ మాసపత్రికకి- ఓ బాల, గొపాలాలకి మాత్రమే పరిచితులైన మాన్యులు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం రచనలు పండు వెన్నెలలై శోభించాయి. వారి పరిచయం అక్షరజాలంలో “మన పాత్రికేయులు” వర్గంలో లభిస్తుంది. ఈ సంవత్సరం జనవరి 27న వారు అమావాస్య చంద్రుడైనారు. వారిని సంస్మరిస్తూ బాల సాహిత్య పరిషత్తు హైదరాబాదులో ఫిబ్రవరి 16న ఒక సభ- చంద్రునికో నూలుపోగులాకాక పట్టుపోగులా నిర్వహించింది. నిర్వాహకులను అభినందిస్తూ ఆ సభా విశేషాలకు లింకు ఇస్తున్నాం: http://venuvu.blogspot.com/. వారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందుకు ఈ లింకు దోహదం చేస్తుంది. వచ్చే ఏప్రిల్ నెల “రచన” మాసపత్రిక శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణ సంచికగా వెలువడనుంది.

Leave a Reply

%d bloggers like this: