Site icon వసుంధర అక్షరజాలం

ఏడు వారాల సీరియల్స్ పోటీ

నిర్వహణ: యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్ట్స్ (డాక్టర్ కె. వివేకానందమూర్తి)-నవ్య వీక్లీ సంయుక్తంగా.
ప్రథమ బహుమతి:
రూ 25,000 
ద్వితీయ బహుమతి: రూ 15,000
తృతీయ బహుమతి: రూ 10,000
5 విశేష బహుమతులు (సీరియల్ ఒక్కింటికి): రూ 7,000
నిబంధనలు:
1. నేపధ్యం ప్రపంచంలో ఏ ప్రాంతానిదైనా కథ తెలుగు వారిదై, వారి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి.
2. రచయిత(త్రి) పేరు, పూర్తి చిరునామా- రచనతోపాటు కాక వేరే కాగితంపై వ్రాయాలి. హామీపత్రం విధిగా జతపర్చాలి. కవరుమీద యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్ట్స్-నవ్య వీక్లీ ఏడు వారాల సీరియల్ పోటీకి అని స్పష్టంగా పేర్కొనాలి.
3. అరఠావు సైజులో 70 పేజీలు, డి.టి.పి చేసిన పక్షంలో 50 పేజీలు మించకూడదు.
4. ప్రచురణకు స్వీకరించని రచనలు తిప్పి పంపబడానికి తగిన పోస్టేజి అతికించిన కవరు జతపర్చాలి. 
చిరునామా: నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్, ప్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500 033
ముగింపు తేదీ: మే 24, 2010

Exit mobile version