వసుంధర అక్షరజాలం

రచన దీపావళి కథల పోటీ

తొలి అధునిక తెలుగు కథ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రచన మాసపత్రిక ప్రత్యేక కథల పోటీని నిర్వహిస్తోంది.

కథకు మూడువేలు చొప్పున ఎంపిక చేసిన ఐదు కథలకు సమాన బహుమతులు. వాటిలో మొదటి 3 కథలకూ- రూ 3,000, 2000, 1000 చొప్పున ప్రత్యేక బహుమతులు.

సూచనలు:

1. కథావస్తువును బట్టి కథ నిడివి కాబట్టి పేజీల పరిమితి లేదు. అలాగని నవలికలుగా రూపాంతరం చెందిన కథలను పంపరాదు.

2. కథావస్తువు సమకాలీన జీవితాన్నీ, మానవత్వపు విలువల్నీ ప్రస్ఫుటం చేస్తూ- నవరసాల్లో ఏ అంశానికైనా ప్రాధాన్యమివ్వచ్చు.

3. అను; ఐలీప్; లేఖిని; యూనికోడ్; విజన్-చిత్ర, మేఘన; బరహా; శ్రీలిపి లలో టైపు చేసిన వారు సాఫ్ట్ కాపీలను సీడీలుగా పంపవచ్చు. కానీ హార్డ్ కాపీలు కూడా తప్పనిసరిగా పంపాలి.

4. హామీపత్రం జతపర్చాలి. సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలకు ఎలాంటి నగదు పారితోషికమూ ఉందదు. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపడానికి తగినన్ని స్టాంపులు అతికించిన స్వంత చిరునామా గల కవరు జతపర్చాలి.

కథలు పంపాల్సిన చిరునామా: “రచన” ఇంటింటి పత్రిక, 1-9-286/2/P, విద్యానగర్ (రాంనగర్ గుండు దగ్గిర), హైదరాబాద్ 500 044.

కథలు అందాల్సిన చివరి తేదీ: జూలై 10, 2010.

Exit mobile version