మార్చి 6, 2010
సరసమైన కవితల పోటీ
కార్టూనిస్ట్, కథారచయిత, కాలమిస్ట్ భువన్ వారి తండ్రి జ్ఞాపకార్థం “మల్లెతీగ”తో కలిసి నిర్వహిస్తున్న
మళ్ల జగన్నాధం స్మారక సరసమైన కవితల పోటీ.
ప్రథమ బహుమతి: రూ 500.
ద్వితీయ బహుమతి: రూ 300.
ఒకొక్కటి రూ 100 చొప్పున 12 ప్రత్యేక బహుమతులు.
నిబంధనలు:
1. కవిత 20 పంక్తులకు మించరాదు.
2. సరసమే తప్ప శృతి మించిన శృంగారం పనికిరాదు.
3. శీర్షిక, అంశం వినూత్నంగా ఉండి సందేశం మిళితమైన కవితలకు ప్రాధాన్యం.
చిరునామా: ఎం.విజె. భువనేశ్వరరావు (భువన్), డోర్ నెం. 15-21-12/3, ఉమెన్స్ కాలేజీ వద్ద, అనకాపల్లి 531 002, విశాఖ జిల్లా
ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2010.
Mamatha said,
ఏప్రిల్ 1, 2010 at 11:23 ఉద.
ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు
చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ
మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ
నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
నవ్వే వాటికి మందూ
నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
ఆదరాలా నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ
సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించూ
ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవె గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ ……..