మార్చి 6, 2010

హరిత కవిత 2009

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 5:07 ఉద. by వసుంధర

జాగృతీకిరణ్ ఫౌండేషన్- మల్లెతీగ సకుటుంబ మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో

పర్యావరణ కవితోద్యమంలో భాగంగా

తెలుగులో 2వ అంతర్జాతీయ పర్యావరణ కవితల పోటీ: హరిత కవిత 2009.

మొదటి బహుమతి: రూ 1500, బంగారు పతకం వగైరా

రెండవ బహుమతి: రూ 1000, బంగారు పతకం వగైరా

మూడవ బహుమతి: రూ 500, బంగారు పతకం వగైరా

ఇంకా 4 ప్రోత్సాహక బహుమతులు (ఒకొక్కటి రూ 250), 5 ప్రత్యేక బహుమతులు (ఒకొక్కటి రూ 200).

వివరాలు

1. కవిత 30 పంక్తులకు మించకూడదు. రచన తమ స్వంతమేనంటూ కవులు హామీపత్రం, పూర్తి చిరునామా (పిన్‌కోడ్, మొబైల్ నంబరు) పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జీవిత వివరాలు జతపర్చాలి. కవి పేరు కవితతోపాటు కాక హామీపత్రంలో వ్రాయాలి.

2. కవితలు పర్యావరణ సమస్యలు, పరిరక్షణ, నివారణోపాయం అంశాలకు పరిమితం కావాలి.

3. పోటీ మల్లెతీగ చందాదారులకు మాత్రమే. చందాదారులు కానివారు రూ 120 మల్లెతీగ కార్యాలయానికి మనియార్డరుగా పంపాలి.

4. విజేతల వివరాలు అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో వగైరాలకు పంపబడతాయి.

5. కవరుపై హరిత కవిత-2009 అని స్పష్టంగా వ్రాయాలి.

ఇంకా అనేక ఆసక్తికరమైన వివరాలకు మల్లెతీగ మార్చి 2010 సంచిక చూడవచ్చు. మల్లెతీగ మొబైల్ 92464 15150 కి కూడా ఫోన్ చేయవచ్చు.

చిరునామా: హరిత కవిత 2009, సంపాదకుడు, మల్లెతీగ సకుటుంబ మాసపత్రిక, డోర్ నెం. 41-20/6-43, పోలీసు రామయ్య వీధి, కృష్ణలంక, విజయవాడ 520 013, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

గడువు తేదీ: మే 30, 2010.

1 వ్యాఖ్య »

  1. vamsi krishna said,

    nimma gaDDa foundation. hyderabd is conducting SriSri memorial story/essay competetion.
    Details are available in Sakshi news paper at the following URL

    http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=48964&subcatid=18&categoryid=1


Leave a Reply

%d bloggers like this: