మార్చి 27, 2010

పదహారు వారాల సీరియల్స్ పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:40 ఉద. by వసుంధర

స్వాతి వారపత్రిక ఏప్రిల్ 2 (2010) సంచికలో పదహారు వారాల సీరియల్స్ పోటీ ప్రకటించింది. 
                            రూ 25000 చొప్పున 12 నవలలకు- బహుమతి మొత్తం రూ 3 లక్షలు.
నిబంధనలు:
1. సాంఘిక, జానపద, పౌరాణిక, హాస్య, అపరాధపరిశోధన, ప్రేమ, ఫాంటసీ వగైరాలలో ఏ అంశాన్నైనా ఎంచుకోవచ్చు.   
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రితం- అని స్వదస్తూరీతో వ్రాసిన హామీపత్రం జతపర్చాలి.
3. రచనమీద నవల పేరు మాత్రమే ఉండాలి. రయిత(త్రి) పేరు, చిరునామా విడిగా వ్రాతప్రతితో జతపర్చాలి. 
4. పేజీకి 200 పదాల చొప్పున 160 పేజీలు ఉండాలి. పేజీలు తక్కువైతే పోటీకి పరిశీలనార్హం కాదు. కవరుమీద “పదహారు వారాల సీరియల్స్ పోటీకి” అని వ్రాయాలి.
5. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపాలంటే- తగినన్ని స్టాంపులు అతికించిన కవరుపై స్వంత చిరునామా వ్రాసి జత పర్చాలి.
చిరునామా: ఎడిటర్, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002
ముగింపు తేదీ: మే 15, 2010
ఇంకా వివరాలు కావాలంటే స్వాతి వారపత్రిక చూడగలరు.

Leave a Reply

%d bloggers like this: