ఏప్రిల్ 2, 2010

ముఖాముఖీ- ఏప్రిల్ 1, 2010

Posted in ముఖాముఖీ at 5:15 ఉద. by వసుంధర

అక్షరజాలం వేదికను పంచుకుంటూ పుష్టినిస్తున్నవారందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
ఎందరో అభిమానాన్ని ప్రకటించారు. శుభాకాంక్షలు తెలిపారు. మీ అభిమానాన్ని నిలుపుకుంటూ, అకాంక్షలు నిజంచేసే దిశలో మా కృషి కొనసాగుతుందని హామీ.
అందరికీ అంతగా పరిచయం లేని మహా రచయితలు ఎందరో ఉన్నారు. వారి వివరాల సేకరణలో మీ సహకారం కోరుతున్నాం. ఐతే తెలుగులో ప్రచురితమైన ఒక్క కథ ఉన్నా- ఆ రచయిత వివరాలు ఫొటోతో సహా సేకరించి భద్రపర్చాలని  పూనుకున్న కథానిలయం వివరాలు కూడా ఈ బ్లాగులో ఉన్నాయి. రచయిత  ద్వారక గారి వివరాలు కథానిలయానికి చేరుకున్నాయని ఆశిస్తున్నాం.
రచయితలను వ్యక్తిగతంగాకంటే ఎక్కువగా పరిచయం చేసేవి వారి పుస్తకాలు. క్రమబద్ధంగా అందజేసే మా పుస్తక పరిచయాలు మా పరిమితుల మేరకు అలాంటి ప్రయత్నం.
కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు వగైరాలతోపాటు ముందుమాటలో అన్నట్లు- పలు సమకాలీన అంశాలకు ఈ అక్షరజాలం వేదిక. మేము కదిపితే మీరు కుదిపేయాలని మా అభిలాష.
ఈ బ్లాగుకి వచ్చే ఉత్తరాలలో అందరికీ పనికొచ్చే సమాచారం ఉండడం ముదావహం. అందుకని ఇకమీదట ఉత్తరాలకు విడివిడిగా కాక ముఖాముఖీ శీర్షికలో బదులివ్వడం అందరికీ వీలుగా ఉంటుందని భావిస్తున్నాం.
ఉత్తరాల్లో- చక్కని కవితనందించిన “మమత” గారికి అభినందనలు.
ఆసక్తికరమైన చర్చలకై ఎదురు చూస్తూ
వసుంధర

2 వ్యాఖ్యలు »

 1. AMBALLA JANARDAN said,

  వసుంధర గార్లకు నమస్కారం.
  ముఖాముఖిలో జవాబులు ఇవ్వ తలచడం బావుంది, కాని అక్షరాజాలం క్రమంతప్పకుండా చదివే అలవాటు లేని వారికోసం కొంతకాలం విడిగా కూడా జవాబులు ఇస్తే బావుంటుంది. ఈ సూచనపై ఆలోచించండి.
  – అంబల్ల జనార్దన్

  • శ్రీ జనార్దన్ గారికి,
   నమస్కారం.
   మీ సూచన ఆచరణీయం. ధన్యవాదాలు.
   వసుంధర


Leave a Reply

%d bloggers like this: