జూన్ 2, 2010

అన్నమయ్య సందేశం

Posted in సంగీత సమాచారం at 3:56 ఉద. by వసుంధర

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు (అన్నమయ్య) 1408 మే 9న జన్మించాడు. మహాభక్తుడైన ఆయన విష్ణు సంకీర్తనకే తన జీవితాన్ని అంకితం చేసాడు. ఆయన వేలాది కీర్తనల్లో ఎక్కువ భాగం శ్రీ వేంకటేశ్వరుని ప్రస్తుతించాయి. పద కవితా పితామహుడిగా అభివర్ణించబడే ఆయన పాటలు- కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. శాస్త్రీయతలోనే లాలిత్యమూ, పాండితీ ప్రకర్షలోనే పామరజనరంజనా- ఆయన కీర్తనల ప్రత్యేకత. అజరామరమైన అన్నమయ్య పాటలకు 20, 21వ శతాబ్దాల్లో ప్రాచుర్యం పెరగడం ముదావహమే కానీ ఆశ్చర్యం కాదు. ఐతే అన్నమయ్య కీర్తనల్లో సంగీతంతోపాటు సమాజపు హితవును కోరే గొప్ప సందేశమూ వినిపిస్తుంది. 600 ఏళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటేనని ఘోషిస్తూ, కులతత్వాన్ని నిరసించాడాయన. కానీ ప్రస్తుతం పెద్దల సుద్దుల్ని చట్రంలో బిగించి ఆరాధించడమే తప్ప, అనుసరించాలని తెలియకపోవడమే ఆధునికతగా చెలామణీ ఔతోంది. అమెరికావంటి అత్యాధునిక దేశాల్లో ఉంటూ కూడా అర్థవిహీనమైన కులతత్వాన్ని విడిచిపెట్టలేని తెలుగువారే అందుకు నిదర్శనం. అన్నమయ్య పాటల్ని అవగాహన చేసుకుంటే- ఆధునికతలో 600 ఏళ్లు వెనుకబడ్డామా అని తప్పక అనిపిస్తుంది. కీర్తనల్లో అన్నమయ్య వాడిన ఎన్నో అచ్చతెనుగు పదాలు నేడు ప్రచారంలో లేనందున ఆ పాటల్ని అర్థం చేసుకుందుకు- ప్రత్యేకమైన కృషి కావాలి. ఈ విషయమై ప్రముఖ సంగీత విమర్శకులు శ్రీ వి.ఎ.కె. రంగారావు వ్యాసమొకటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్ డే లో వచ్చింది. ఈ విషయంలో  డా. తాడేపల్లి పతంజలి కృషి మెచ్చుకోతగ్గది. ఫన్ డే లో అన్నమయ్య పాటల అర్థం, పరమార్థం వివరిస్తున్న వారి వ్యాసపరంపర ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి. 600 ఏళ్లనాటి ఆధునిక బావాలే కాక, భాష సొగసులూ అధ్యయనం చేయడానికి సహకరించే ఈ వ్యాసాల్లో కొన్నింటికి లింకు ఇస్తున్నాం. త్వరలో అన్నింటికీ ఇవ్వగలం. 1503లో ఫిబ్రవరి 23న పరమపదించిన అన్నమయ్య తన కీర్తనల ద్వారా చిరంజీవి.

అన్నమయ్య అన్నమాట
ముద్దుగారే 1

ముద్దుగారే 2

కొలని దోపరికి
ఇట్టి ముద్దులాడి
కొండవేల నెత్తినట్టి
మూసిన ముత్యాల
చూడరమ్మ
ఎవ్వరెవ్వరివాడొ
కట్టెదుర
నానాటి బదుకు
నిగమ నిగమాంత

అన్ని మంత్రములు

అంతర్యామీ అలసితి సొలసితి

రాముడు లోకాభిరాముడు
శిరుత నవ్వులవాడు
బ్రహ్మ కడిగిన పాదము
పుడమినిందరి

జయజయ రామ

ఇందరికి నభయంబు

భావయామి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి