జూన్ 24, 2010

వెబ్‌లో కౌముది

Posted in సాహితీ సమాచారం at 2:46 ఉద. by వసుంధర

ప్రముఖ రచయిత, సంపాదకుడు కిరణ్‌ప్రభ సంపాదకత్వంలో 2007 జనవరినుంచి ఆరంభమైన కౌముది వెబ్‌పత్రిక- వెబ్‌లో వచ్చే మితతా పత్రికలకు భిన్నమైనది. 1960లలో వివిధ తెలుగు పత్రికలు ప్రారంభించిన దీపావళి ప్రత్యేక సంచికల ఒరవడిని ప్రతి నెలా పాటించే ఈ విశిష్టపత్రిక సాహితీ అభిమానులందరూ చదివి తీరాల్సినది. కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు మాత్రమే కాక ఆకర్షణీయమైన ఎన్నో శీర్షికలు ఈ పత్రికకు ప్రత్యేకం. అనుభవైకవేద్యానికి ఇక్కడ కొన్ని లింకులు ఇస్తున్నాం. వీలు చూసుకుని త్వరలో పత్రికను మా మాటల్లో సమగ్రంగా పరిచయం చేయగలం. కిరణ్‌ప్రభ గారి వివరాలు కూడా అందజేయగలం.
కౌముదిలో వచ్చిన వివిధ రచనలను వర్గీకరించి పుస్తకరూపమిచ్చి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచడం- ఈ పత్రిక ప్రారంభించిన ఓ గొప్ప కొత్త సంప్రదాయం. ఆధునిక దృక్పథంతో భక్తిని విశ్లేషించిన మా వ్యాసపరంపర భక్తిగిరి గానూ, మా అపరాధ పరిశోధన కథల్లో పన్నెండు ఓ సంకలనంగానూ ఈ గ్రంథాలయంలో లభిస్తాయి. కిరణ్‌ప్రభ కృషిని అభినందిద్దాం. వారి సాహితీసేవ నిరంతరం నిరాటంకంగా కొనసాగుతుందని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: