వసుంధర అక్షరజాలం

కథలే కన్నానురా… జూలై 18, 2010

పెద్దలు నిర్ణయించిన భాగస్వామిని పెళ్లి చేసుకుని ప్రేమించాలా (love at first night) లేక తమకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలా (love at first or some sight)- అన్నది అనాదిగా యువత సందిగ్ధం. ఈ విషయంపై ఆధునిక వాతావరణానికి అన్వయించే కథాంశంతో వచ్చిన వసుంధర నవల “లవ్ యట్ ఫస్ట్ నైట్” ఆగస్టు స్వ్వాతి (మాసపత్రిక) నవలానుబంధంగా వచ్చింది.
రాజకీయ నాయకులు పార్టీలు మారడాన్ని ఎలా అనుకోవాలో చెప్పే వసుంధర కథ “హోం కమింగ్” ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో (మే 23, 2010) చూడగలరు.
కథలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చావేదిక- ప్రతి నెలా రచన మాసపత్రికలో వచ్చే వసుంధర “సాహితీవైద్యం”. ఆగస్టు (2010) రచన మాసపత్రికలో ఈ క్రింది కథకుల కథలపై వసుంధర విశ్లేషణ వస్తుంది. మీ స్పందనకై ఆ కథలకు ఇక్కడ లింకు ఇస్తున్నాం:
అంగర సూర్యారావు
పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)
సాయిలక్ష్మి
కలశపూడి శ్రీనివాసరావు
కోలపల్లి ఈశ్వర్
సింహప్రసాద్
ఆదివారం ఆంధ్రజ్యోతి- అనూస్ హాస్టల్స్, చీరాల సంయుక్తంగా నిర్వహించిన కథావసంతం కథల పోటీలో బహుమతి పొందిన డా. మనోహర్ కోటకొండ కథకు గతంలో లింకు ఇచ్చాము. దానితోపాటు ఇంతవరకూ ప్రచురితమైన మరో మూడు బహుమతి కథలపై వసుంధర విశ్లేషణ ఆగస్టు రచనలో వస్తుంది. మీ స్పందనకై ఆ కథలకు ఇక్కడ లింకు ఇస్తున్నాం:
పెద్దింటి అశోక్‌కుమార్
పి. చంద్రశేఖర ఆజాద్
డి.ఆర్. ఇంద్ర

Exit mobile version