Site icon వసుంధర అక్షరజాలం

స్వాతి వారపత్రికలో కథ, కార్టూన్ పోటీలు

ముందుగా ఈ పోటీ వివరాలు అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

సీపీ బ్రౌన్ -స్వాతి సంయుక్త నిర్వహణలో దసరా కథల పోటీ
ప్రథమ బహుమతి: రూ 25000
మూడు ద్వితీయ బహుమతులు (ఒక్కింటికి): రూ 15000
ఐదు తృతీయ బహుమతులు (ఒక్కింటికి): రూ 10000
ఆరు ప్రత్యేక బహుమతులు (ఒక్కింటికి): రూ 5000
ఇరవై సాధారణ ప్రచురణలు (ఒక్కింటికి): రూ 2500
నిబంధనలు:
నేపధ్యం ఏదైనా కథ తెలుగువారికి సంబంధించినదై వుండాలి. నిడివి 25 లైన్‌లలో 10 పేజీలకు మించకుండా వుండలి. బహుమతి పొందిన కథలతో సీపీ బ్రౌన్ అకాడమి కథా సంపుటి వెలువరిస్తుంది. కాపీరైట్ హక్కులు అకాడమీకి వుంటాయి.
ఆఖరు తేది: సెప్టెంబరు 10, 2010
స్వాతిలో కొత్త శీర్షిక: బాపు కార్టూన్‌కు కథ
గతంలో స్వాతి నిర్వహించిన “బాపు బొమ్మకు కథ” శీర్షికలాగే ఈ శీర్షిక. వారం వారం స్వాతిలో ప్రచురించే “బాపు కార్టూన్‌కు” కథ వ్రాయండి. కథ ఒక్కింటికి 500 చొప్పున రెండు బహుమతులు. నిడివి రెండు అరఠావులు మించకూడదు. ఈ వారం (30 జూలై) పోటికి చివరి తేది 31 జులై.

పై రెండింటి వివరాలు స్వాతి జులై 30 సంచికలో.

Exit mobile version