ఆగస్ట్ 3, 2010

కవితాజాలం

Posted in కవితాజాలం at 3:43 ఉద. by వసుంధర

ఇంతవరకూ ప్రచురణకాని మీ స్వంత కవిత ఏదైనా మాకు పంపండి.. నచ్చితే యథాతథంగా పాఠకులకి అందజేస్తాం. అవసరమనిపిస్తే చిరు మార్పులుచేసి- మీ సమ్మతితో- అలా పాఠకులకి అందజేస్తాం. మార్పులు మరీ ఎక్కువైతే- వాటిని సూచిస్తూ తిరగరాయడానికి మీకు పంపగలం.
సూచనలు:
1. రచనాజాలంకు పంపే రచనల లిపికి- iLeap, Lekhini, Anu Softwareలలో ఏదైనా ఉపయోగించవచ్చు. చేతివ్రాతప్రతులు స్కాన్ చేసి పంపకూడదు.
2. రచనాజాలం ప్రచురణార్హతకి సూచిక. రచన ఎక్కువమంది పాఠకుల్ని చేరడానికి- మా అనుమతితో ఇతర పత్రికలకు కూడా పంపుకోవచ్చు.
మా అభిరుచికి నచ్చిన సరికొత్త కవితలు:

నయాగరా జలపాతం    హిమశకలం    శ్వేతగులాబి  పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అక్షరరుచి చివరి మజిలీ    నే కొన్న కల

1 వ్యాఖ్య »

 1. తలిరాకుల తలుపు తీసి..,
  పరవశాల రాశి పోసి..,
  తారుణ్యపు వేదనలను
  తీయ తీయగా పాడే..,
  ఎలమావుల రెమ్మలలో..
  హొయలు చిలుకు కోయిలా..
  పుష్పశరుని జాడ ఏదే..
  కందర్పుని జాడ ఏదే..

  పూదేనియలూరు విరులు
  విర విరలే పొయినవే..
  చిగురాకుల రాచిలుకలు
  కల కలముల పిలచినవే..
  విరి శరముల పులకింతకు
  కౌముదులే వేగినవే..
  కన్నె కనుల మార్దవమై
  పుష్పశరుని రమ్మనవే..

  చిత్తములో నవ్య సుధలు
  కమ్మని తావులు విరియా..
  తలపులలో తరళిత
  సౌదామినులే మెరయా..
  విశ్వమంతా సౌందర్యపు
  చిత్తరువై నిలచే
  విరహానలమున విరాళి
  మదనునికై వేచే
  పుష్పశరుని జాడేఅదే..
  కందర్పుని జాడ ఏదే..


Leave a Reply

%d bloggers like this: