ఆగస్ట్ 3, 2010

రచనాజాలం

Posted in రచనాజాలం at 3:23 ఉద. by వసుంధర

సృజనకు అందరికీ అనువైన ప్రక్రియ రచన ఐతే- దాన్ని  అందరి అందుబాటులోకీ తెచ్చే ప్రక్రియ ప్రచురణ. అందుకు అచ్చులో, అంతర్జాలంలో అనేక పత్రికలున్నా- కొన్నింటికి ప్రచురణార్హత లేకనూ, మరికొన్నింటికి ప్రచురణావకాశాల పరిమితి వల్లనూ- చాలా రచనలు రచయిత(త్రు)లను దాటి వెళ్లకపోవచ్చు. అక్షరరూపం దాల్చిన ప్రతి మంచి రచనా పాఠకుల్ని చేరాలన్న సంకల్పానికి కార్యాచరణే రచనాజాలం.
మీ స్వంత రచన– కథ, కవిత, నాటిక వగైరాలలో ఏదైనా రచనాజాలంకి పంపవచ్చు. మా అభిరుచికి నచ్చినవి యథాతథంగా పాఠకులకి అందజేస్తాం. కొద్దిగా మార్పులు అవసరమనిపిస్తే సరిచేసి- వ్రాసినవారికి సమ్మతమైతే- ఆ మార్పులతో ప్రచురించగలం. మార్పులు మరీ ఎక్కువైతే- వాటిని సూచనప్రాయంగా వ్రాసినవారికి (తిరగరాయడానికి) పంపగలం.
సూచనలు:
1. రచనాజాలంకు పంపే రచనల లిపికి- iLeap, Lekhini, Anu Softwareలలో ఎదైనా ఉపయోగించవచ్చు. చేతివ్రాతప్రతులు స్కాన్ చేసి పంపకూడదు.
2. రచనాజాలం ప్రచురణార్హతకి సూచిక. రచన ఎక్కువమంది పాఠకుల్ని చేరడానికి- మా అనుమతితో ఇతర పత్రికలకు పంపుకోవచ్చు.

కవితాజాలం
కథాజాలం

Leave a Reply

%d bloggers like this: