ఆగస్ట్ 6, 2010

ముఖాముఖీ ఆగస్ట్ 5, 2010

Posted in ముఖాముఖీ at 4:07 ఉద. by వసుంధర

తెలుగులో బ్లాగులు వ్రాసేవారికి, బ్లాగుల్లో తెలుగు వ్రాసేవారికి లేఖిని ఎంతో సౌకర్యంగా ఉంది. ఎటొచ్చీ లేఖినిలో- ఒక బాక్సులో ఇంగ్లీషులో టైపు చేస్తే- క్రింద బాక్సులో తెలుగులోకి మారుతుంది. దీనివల్ల editing కి కలిగే ఇబ్బందిని అధిగమించడానికి- క్రింద బాక్సులోని తెలుగు లిపిని పై బాక్సులో అతికించవచ్చు.


టైపు చేస్తున్నప్పుడే నేరుగా ఇంగ్లీషునుంచి తెలుగు లిపి లోకి మారే  iLeap, Anu వంటి softwares- వెబ్ లిపికి సహకరించవు. అలా ఉపయోగపడే unicode software కి ఇక్కడ లింకు ఇస్తున్నాం. gmail లో నేరుగా తెలుగు టైపు చేసేవారికి ఇది అత్యంత సులభం. లేదా కొద్దిగా అలవాటు పడాలి. ఈ సైట్ లో సౌకర్యం ఏమంటే- లేఖిని లిపిని ఇందులో అతికించవచ్చు. ఈ లిపిని లేఖినిలోనూ అతికించవచ్చు.


లేఖినిలోనూ, ఈ సైట్ లోనూ వచ్చిన తెలుగు లిపిని MS Word లో అతికిస్తే- అక్షరాలకు బదులు చిన్న చిన్న చదరాలు కనిపిస్తాయి.  కలవరపదవలసిందేమీ  లేదు. ఆ చదరాలను తిరిగి ఆయా సైట్లలో అతికిస్తే తెలుగు లిపి మళ్ళీ ప్రత్యక్షమౌతుంది.  MS Word 7 లో ఐతే తెలుగు లిపి తెలుగు లిపిగానే దాచుకోవచ్చు.


ఇంకా ఈ సైట్ లో వివిధ భాషల నిఘంటువులున్నాయి. వాటి ప్రయోజనం వాడితే తెలుస్తుంది. ఉదాహరణకు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువుకి లింకు ఇక్కడ ఇస్తున్నాం.


మళ్ళీ కలుద్దాం


వసుంధర

4 వ్యాఖ్యలు »

 1. tprao said,

  వసుంధర గారికి సాహితీ నమస్కారాలు…
  అను ఫాంట్ మేటర్ ను యూనికోడ్ లోకి, యూనికోడ్ మేటర్ ను అనుఫాంట్ లోకి మార్చే విధానం గురించి దయచేసి తెలియజేయగలరు….

  • ఒక వెర్షన్‌లో టైపు చేసిన తెలుగు లిపిని మరో వెర్షన్ లిపిగా మార్చడానికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ అవసరం. అక్షరజాలం వీక్షకులకోసం ఆ వివరాలు ఈ రోజు తపాలో ఇస్తున్నాం. చూడగలరు.

 2. ఇప్పటికి “లేఖిని” ది బెస్ట్.

  క్రింద బాక్స్ లో తెలుగు లిపిని, పై బాక్స్ లో అతికించడం వల్ల ప్రయోజనం యేముంటుంది? యేమో!

  మిగిలిన “Transliterations”–ఇతర భాషల సంగతి నాకు తెలియదు గానీ, తెలుగులో మాత్రం దరిద్రం గా వుంటున్నాయి.

  లెట్ దెమ్ ఇమ్‌ప్రూవ్!

  • సరిదిద్దాల్సిన వాక్యాలున్న బాక్సు, సరిదిద్దాల్సిన బాక్సు- వేర్వేరు కావడంలో కొంత అసౌకర్యం ఉన్నదనిపించింది. అందుకు మాకు తోచిన పరిష్కారం సూచించాం. అంతే! వెబ్ పోస్టింగుకి లేఖినిని మించినడి లేదన్న మీ అభిప్రాయంతో మేమూ ఏకీభవిస్తున్నాం…..


Leave a Reply

%d bloggers like this: