ఆగస్ట్ 11, 2010
పాడుతా తీయగా (ఈ టీవీ)- (పదిహేడవ భాగం)
Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి", బుల్లితెర-వెండితెర at 5:25 ఉద. by వసుంధర
ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 16 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం. ఇది జులై 26, ఆగస్ట్ 2 (2010) లలో వచ్చిన 17 వ భాగంపై సమీక్ష. మా లెక్క ప్రకారం ఇది ఆరవ క్వార్టర్ ఫైనల్స్. కానీ ఆరంభంలో దీన్ని ఎనిమిదవ క్వార్టర్ ఫైనల్ అన్నారు. రెండు ఎపిసోడ్ల తర్వాత ఒక అభ్యర్ధి తప్పుకోవాలి కాబట్టి- రెండూ కలిపి ఒక క్వార్టర్ ఫైనల్ అనుకోవాలి. కానీ ప్రస్తుతం లెక్కనిబట్టి రెండేసి క్వార్టర్ ఫైనల్స్ కి ఒక అభ్యర్ధి తప్పుకుంటారనుకోవాలి. మరి క్వార్టర్ ఫైనల్ కి నిర్వాహకులిచ్సు నిర్వచనం తెలియదు. ఈ నామకరణం ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఊరుకుంటే చాలు.
ఆ ప్రకారం 7 , 8 భాగాలు రెండింటికీ న్యాయనిర్ణేత ఒక్కరే. వారు సామాన్యులు కారు. అంబ కటాక్షమున్న అసమాన ప్రతిభాశాలి. తల్లి భారతి కాటుక కంట- నీరు రానివ్వని ఆదర్శ కవి. సినీ గీతాలకు సాహిత్యపు విలువలనాపాదించిన కొందరిలో ఒకడిగా వందనాలందుకుంటున్న మహానుభావుడు. ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని సముచితంగా పరిచయం చేసి వేదికపైకి ఆహ్వానించడంలో ఎస్పీబీ తీరు ఎప్పటిలాగే ప్రశంసనీయం. పోటీకి వారి గీతాల్ని ఎన్నుకోవడంవల్ల కార్యక్రమం మరింత రసమయమైంది. నానాటికీ మెరుగు పడుతున్న అభ్యర్ధుల పాత్ర కూడా ఆ రసమయ వాతావరణంలో గమనార్హం. పాటలతోపాటు ఎన్నో కుతూహల విశేషాలు కూడా ఈ కార్యక్రమంలో బయటపడ్డాయి.
సిరివెన్నెల అంతటివారి పదాలను పట్టుబట్టి మార్పించే చిత్రనిర్మాతల గురించి తెలిసింది. ఆ కారణంగా ప్రేక్షకుల్ని చేరలేకపోయిన- అద్భుత పదాప్రయోగాలు స్వయానా కవి నోటనే వినే అదృష్టం కలిగింది. తన పాటల్ని కొత్త గొంతుల్లో విని పరవశించే రసహృదయాన్నీ, కవిలోని కమనీయ గాయకుణ్ణీ చూడగలగడం అసాధారణ అనుభవం. తన అమెరికా యాత్రలో- వంటి బిగువులు కనిపించేలా దుస్తులు ధరించి- కలిసి నృత్యం చేసిన లేత ప్రాయపు అన్నాచెల్లెళ్ల ప్రసక్తి తీసుకొచ్చారు శాస్త్రి. “అలాంటి దుస్తుల్లోని పసిపాపని- మగాడి దృష్టితో కాకుండా తండ్రి దృష్టితో చూడగలవారు మీలో ఉన్నారా” అని అప్పటి ప్రేక్షకులకి ఆయన వేసిన సూటి ప్రశ్న- చర్చనీయాంశం. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు. సంప్రదాయానికీ ఆధునికతకీ మధ్య నడుస్తున్న వివాదం. ఈ అంశాన్ని మరో వేదికపై చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీ శాస్త్రిని అభినందిద్దాం.
తన గీతాల ప్రసక్తి వచ్చినప్పుడు- అహంకారానికీ అతిశయానికీ తావు లేకుండా- నిజాయితీకి లోటు రాకుండా- వినయం ఉట్టిపడేలా ఆయన స్పందించిన తీరు ఎందరికో అనుసరణీయం. ఆయన ఉనికి అటు అభ్యర్ధుల్నీ, ఇటు ప్రేక్షకుల్నీ సమంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే గాయనీ గాయకుల్ని ఎస్పీబీ సమీక్షిస్తున్న తీరు అభినందనీయం. ఈ కార్యక్రమం అనంతరం ఒక అభ్యర్ధి తప్పుకోగా ఆరుగురు మిగిలారు.
ఈ కార్యక్రమం గురించి ఒక అసంతృప్తి ఉంది. 1990లలో పాడుతా తీయగా నిర్వహించినప్పుడు ఎస్పీబీ- పాడేముందు తామెన్నుకున్న పాటకు రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు పేర్లను చెప్పకపోతే గాయనీ గాయకుల్నితప్పు పట్టేవారు. ఈ కార్య్క్రమం మొదలై నెలలు గడిచిపోయినా- ప్రేక్షకులకు ఆ సమాచారం అందకపోవడం సమంజసం కాదు. అడపాతడపా మాటల్లో కొన్ని పాటలకు కొంత సమాచారం అందజేసినంత మాత్రాన ఆయా కళాకారులకు న్యాయం జరుగదు.
Like this:
Like Loading...
Related
Permalink
Chandu said,
ఆగస్ట్ 14, 2010 at 11:49 సా.
వంటి బిగువులు కనిపించేలా దుస్తులు ధరించి- కలిసి నృత్యం చేసిన లేత ప్రాయపు అన్నాచెల్లెళ్ల ప్రసక్తి తీసుకొచ్చారు శాస్త్రి.
Ee lines chadavataanike ibbandi karam gaa unnai. Ee pillala amma, naanna vaallani elaa allow chesaro naaku ardham kaavatam ledu.
Ee chinna pillala dance programs choostunte… ollu mandi pothundi. Emee cheyyaleka channel maarustaa. :'(
Chandu,
http://maverick6chandu.wordpress.com/
చక్రవర్తి said,
ఆగస్ట్ 14, 2010 at 9:07 సా.
వశుంధర గారు,
మొదటగా మీరు కనుక ఈ పోస్టు వ్రాయక పోతే నాకు యూట్యూబ్ లోని పాడుతా తియ్యగా లంకెలు దొరికేవి కావేమో.. అలాగే నా ఈ వీకెండ్ ఇలా ఓ మంచి ఆలోచనతో మొదలైయ్యేది కాదు .. థాంక్స్ ఫర్ ద పోస్ట్ అలాగే లంకెలు ఇచ్చినందులకు. కాకపోతే ఒక చిన్న విషయం మొదటి భాగం లంకె ఎక్కడో మిస్సయ్యింది. ఈనాడు వారు ఆ లంకెలో క్రికెట్ న్యూస్ ఇస్తున్నారు. అందుకని పూర్తిగా చూడలేదు.
అలాగే “అమెరికా – దుస్తులు – అమ్మాయిలు – దర్శించే చూపు – మగ వాడి దృష్టి – తండ్రి – వగైరా – వగైరా ..” వంటి విషయంలో మీ స్పందన నాకు నచ్చింది. నిజమే.. “ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు. సంప్రదాయానికీ ఆధునికతకీ మధ్య నడుస్తున్న వివాదం..” అనే పదాలు నేను కూర్చుకోలేకపోయినా మీరు బాగా వ్రాసారు. ఈ మధ్య నా బ్లాగులో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఓ మంచి వాక్యానిచ్చినందులకు నెనరులు.
మీనుంచి మరింత ఎదురు చూస్తూ..
ఇంతే సంగతులు,
ఇట్లు
భవదీయుడు
వసుంధర said,
ఆగస్ట్ 21, 2010 at 3:59 ఉద.
మొదటి భాగం లంకె మిస్ కాలేదు. క్రికెట్ న్యూస్ అనంతరం పాడుతా తీయగా మొదలౌతుంది. మీ అభిరుచి అభినందనీయం. మీ స్పందనకు ధన్యవాదాలు.
వసుంధర