ఆగస్ట్ 22, 2010

కథలే కన్నానురా ఆగస్ట్ 21, 2010

Posted in సాహితీ సమాచారం at 1:26 ఉద. by వసుంధర

రచయితకు పాఠకులు అవసరం. మంచి రచనలు చేయడానికి మంచి పాఠకులు  అవసరం.
రచనలు చేయడానికి రచయిత పాఠకుడు కావడం అవసరం. మంచి రచనలు చేయడానికి రచయిత కూడా మంచి పాఠకుడు కావడం అవసరం.
పాఠకుల మనోల్లాస వికాసాలకీ, రచయితల మనోవికాసానికీ కథాపఠనం ఎంతగానో సహకరిస్తుంది.
ప్రచురితమైన మా కథలను పరిచయం చేయడానికి ప్రారంభించిన ‘కథలే కన్నానురా’ శీర్షికలో- మాకు సముచితమనిపించిన ఇతరుల కథలనూ పరిచయం చేయడానికి కారణమిదే!
ప్రస్తుతం నవ్య, ఆంధ్రభూమి,
స్వాతి, రచన వగైరా పత్రికలు కథల పోటీలు నిర్వహిస్తున్నాయి.  వివిధ కథల పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులకూ, లబ్దప్రతిష్ఠులకూ ఈ శీర్షిక ప్రయోజనకరం కాగలదని ఆశ.

గతంలో ఏప్రిల్ 10, ఏప్రిల్ 20, మే 29, జూన్ 22, జూలై 18 తేదీలలో అలా కొన్ని కథలు పరిచయం చేసాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వహించిన ‘కథావసంతం’ కథల పోటీలో బహుమతులందుకున్న పది కథల్లో నాలుగింటి పరిచయం వీటిలో ఉంది. ఇంతవరకూ వచ్చిన మరో నాలుగు ‘కథావసంతం’ బహుమతి కథలనిక్కడ  పరిచయం చేస్తున్నాం.

గోగినేని మణి
సింహప్రసాద్
పసుపులేటి గీత
గొల్లపూడి శ్రీనివాసరావు
ఇవి కాక మరికొన్ని:
గౌరీ కృపానందన్ అనువదించిన తమిళ కథ (రచయిత్రి: అనూరాధా రమణన్)
ఆంధ్రభూమి వారపత్రిక (జూలై 15, 2010)లో వచ్చిన  ‘సినమ్మ బడి’ (శ్రీదేవీ మురళీధర్), ‘ఎంపిక’ (టి. శ్రీవల్లీ రాధిక).
స్వాతి వారపత్రిక (జూలై 23, 2010) లో వచ్చిన ‘వినూష’ (యండమూరి వీరేంద్రనాథ్).
పై కథలన్నింటిపై విశ్లేషణ రచన (సెప్టెంబరు, 2010) మాసపత్రికలో లభిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: