ఆగస్ట్ 27, 2010

అన్నమయ్య అన్నమాట ఆగస్ట్ 26 2010

Posted in సంగీత సమాచారం at 2:06 ఉద. by వసుంధర

అన్నమయ్య కీర్తనల్లో  సంగీతంతోపాటు సమాజపు హితవును కోరే గొప్ప సందేశమూ వినిపిస్తుంది. 600 ఏళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటేనని ఘోషిస్తూ, కులతత్వాన్ని నిరసించాడాయన.  కానీ ప్రస్తుతం పెద్దల సుద్దుల్ని చట్రంలో బిగించి ఆరాధించడమే తప్ప, అనుసరించాలని తెలియకపోవడమే ఆధునికతగా చెలామణీ ఔతోంది. అమెరికావంటి అత్యాధునిక దేశాల్లో ఉంటూ కూడా అర్థవిహీనమైన కులతత్వాన్ని విడిచిపెట్టలేని తెలుగువారే అందుకు నిదర్శనం. అన్నమయ్య పాటల్ని అవగాహన చేసుకుంటే- ఆధునికతలో 600 ఏళ్లు వెనుకబడ్డామా అని తప్పక అనిపిస్తుంది. కీర్తనల్లో అన్నమయ్య వాడిన ఎన్నో అచ్చతెనుగు పదాలు నేడు ప్రచారంలో లేనందున ఆ పాటల్ని అర్థం చేసుకుందుకు- ప్రత్యేకమైన కృషి కావాలి. ఈ విషయంలో  డా. తాడేపల్లి పతంజలి కృషి మెచ్చుకోతగ్గది. సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం (ఫన్ డే) లో అన్నమయ్య పాటల అర్థం, పరమార్థం వివరిస్తున్న వారి వ్యాసపరంపర  ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి. 600 ఏళ్లనాటి ఆధునిక బావాలే కాక, భాష సొగసులూ అధ్యయనం చేయడానికి సహకరించే ఈ వ్యాసాల్లో కొన్నింటికి లింకు గతంలో ఇచ్చాం. మరికొన్నింటికి ఇక్కడ:
ఇంతే మరేమీ లేదు 1
ఇంతే మరేమీ లేదు 2
ఆకటి వేళల
అప్పులేని సంసారమైన
జగడపు జనవుల
కంటి శుక్రవారము
నాటికి నాడే  నా చదువు
నానాటి బదుకు
నారాయణతే నమో నమో
నిత్య పూజలివివో
పెరిగినాడు చూడరో
పొడగంటిమయ్య
సకలం హే సఖి
వాడల వాడల వెంట

1 వ్యాఖ్య »

  1. vamsi said,

    swAtilO “sarasamaina kadhala pOTI” prakaTimcAru.
    kadhalu paMpAlsina AKari tEdI 16 oct 2010.


Leave a Reply

%d bloggers like this: