సెప్టెంబర్ 10, 2010

7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

Posted in సాహితీ సమాచారం at 12:47 ఉద. by వసుంధర

1998లో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ద్వైవార్షిక అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సంప్రదాయంలో 7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఇండియానాపొలీస్ మహానగరంలో అక్టోబర్ 9-10 (2010)న జరుగనుంది.   వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు గ్రేటర్ ఇండియానాపొలీస్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ తెలుగు సాహితీ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరికీ ఆహ్వానం.
వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2 వ్యాఖ్యలు »

 1. గౌరావనీయులు వసుంధర గారూ,నమస్కారాలు. ఓ తెలుగు భాషాభిమానిగా యీ సందర్భంలో అంతర్జాల మాధ్యమం ద్వారా మేమూ పాలు పంచుకో వచ్చునా ? శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.

  • శ్రీ రాఘవేంద్రరావు గారికి,
   నమస్కారం.
   మాకు తెలిసినంతవరకూ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కేవలం సభాముఖమైన వేడుక. ఐనప్పటికీ మీరు మీ ఆసక్తిని, అభినందనలను నిర్వాహకులకు- ఆహ్వానపత్రంలో ఇచ్చిన ఈ మెయిల్ చిరునామాకు తెలియబర్చవచ్చును.
   వసుంధర


Leave a Reply

%d bloggers like this: