సెప్టెంబర్ 11, 2010

తెలుగు సాహితిమూర్తుల జీవనరేఖల కేలండర్

Posted in సాహితీ సమాచారం at 7:01 సా. by వసుంధర

సాహితి మిత్రులకు అనిల్ అట్లూరి ఇలా తెలియజేస్తున్నారు.

ఇది వరకే తెలియజేసినట్లు, తగిన వ్యవధి ఉంటే, మీరు మీ పాఠకులకు కాని, వీక్షకులకు కాని మన తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో సుసంపన్నం చేసినవారిని గుర్తు / పరిచయం చెయ్యడానికి ముందుంటారన్న సదుద్దేశంతో  “తెలుగు సాహితిమూర్తుల జీవనరేఖలు” కేలండర్‌ని క్రోడికరిస్తున్నాను.‌  కనీసం ఒక వారం, పది రోజుల ముందే మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను.

ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. తెలుగు అక్షరాలని చూపించే కంప్యూటర్ / మొబైల్ ఫోన్ మరొక అవసరం. ఈ రెండూ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఈ కేలండర్ని చూడవచ్చు.

బుక్ మార్క్ ద్వారా ఇతరులతో దీనిని పంచుకోవచ్చు.

ఈ కేలండర్ అసంపూర్ణం, కాని నా వంతు కృషిగా దీనిని పరిపూర్ణం చేయ్యడానికి కృషి చేస్తున్నాను.  మీకు తెలిసిన వారి వివరాలు ఉంటే నాకందిస్తే దీనికి కలిపి మరింత మెరుగైనదిగా తీర్చిదిద్దవచ్చు. పొరబాట్లు / సలహాలు ఏవైనా ఉంటే తెలియజేయగలరు.


1 వ్యాఖ్య »

  1. saamaanyudu said,

    Great Work.. Hats off to you…


Leave a Reply

%d bloggers like this: