వసుంధర అక్షరజాలం

లెక్కెట్టుకోక మునుపు సెప్పాల

దివంగత కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి ఆంధ్రుల ప్రియతమ నాయకుడు. 2004లో తెలుగువారు ఆయనకు పట్టం కట్టారు. ఆయన ఐదేండ్ల పాలన మెచ్చి 2009లో తిరిగి పట్టం కట్టారు. 2009లో ఆయన హఠాన్మరణానికి కంటతడి పెట్టనివారు లేరు.
ఆయన పాలన సమయంలో అవినీతి రాజ్యమేలిందనీ, ఆయనే అక్రమంగా ఆస్తులు పెంచుకున్నారనీ ప్రతిపక్షాలు. మీడియా కూడా ఘోషించాయి. కొందరు అస్మదీయులు కూడా ఆ ఘోషకు గొంతులు కలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు సరికదా ఆయనపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించి మద్దతునిచ్చింది. ఆయన అభిమానులు సంతోషించారు. వ్యతిరేకులు ముక్కుమీద వేలేసుకున్నారు. రాజకీయాల తీరు తెలిసినవారు నిజం రెండింటికీ మధ్యలో ఉండి ఉండొచ్చనుకున్నారు.
రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ కొంతకాలంగా ఓదార్పు యాత్రలో ఉన్నారు. అది ప్రజల కంటి తుడుపుకని కొందరూ, అధిష్ఠానానికి దిగదుడుపు అని కొందరూ అనుకున్నారు. అధిష్ఠానం వద్దంటున్నా ఆయన తన యాత్రను ఉండిఉండి కొనసాగిస్తున్నారు.  ఈ విషయమై స్పందిస్తూ- కాంగ్రెస్ అధిష్ఠానం- ‘రాజశేఖర రెడ్డి ఆస్తులు సంపాదించుకున్న మాట నిజమనీ- జగన్ దేవుడు విధించిన ఏ శిక్షకైనా అర్హుడేననీ’ కాస్త కఠినంగా అన్నట్లు సెప్టెంబరు 10 ఈ నాడు దినపత్రిక కథనం.
ఇది నిజమే ఐతే- “ఆ ముక్క నేను లెక్కెట్టుకోక మునుపు సెప్పాల” అన్న ముత్యాలముగ్గు డైలాగు గుర్తు చేసుకోవడం మినహా సామాన్య పౌరుడు ఏంచేయగలడు?

Exit mobile version