సెప్టెంబర్ 11, 2010
లెక్కెట్టుకోక మునుపు సెప్పాల
Posted in సాంఘికం-రాజకీయాలు at 4:15 ఉద. by వసుంధర
దివంగత కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి ఆంధ్రుల ప్రియతమ నాయకుడు. 2004లో తెలుగువారు ఆయనకు పట్టం కట్టారు. ఆయన ఐదేండ్ల పాలన మెచ్చి 2009లో తిరిగి పట్టం కట్టారు. 2009లో ఆయన హఠాన్మరణానికి కంటతడి పెట్టనివారు లేరు.
ఆయన పాలన సమయంలో అవినీతి రాజ్యమేలిందనీ, ఆయనే అక్రమంగా ఆస్తులు పెంచుకున్నారనీ ప్రతిపక్షాలు. మీడియా కూడా ఘోషించాయి. కొందరు అస్మదీయులు కూడా ఆ ఘోషకు గొంతులు కలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు సరికదా ఆయనపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించి మద్దతునిచ్చింది. ఆయన అభిమానులు సంతోషించారు. వ్యతిరేకులు ముక్కుమీద వేలేసుకున్నారు. రాజకీయాల తీరు తెలిసినవారు నిజం రెండింటికీ మధ్యలో ఉండి ఉండొచ్చనుకున్నారు.
రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ కొంతకాలంగా ఓదార్పు యాత్రలో ఉన్నారు. అది ప్రజల కంటి తుడుపుకని కొందరూ, అధిష్ఠానానికి దిగదుడుపు అని కొందరూ అనుకున్నారు. అధిష్ఠానం వద్దంటున్నా ఆయన తన యాత్రను ఉండిఉండి కొనసాగిస్తున్నారు. ఈ విషయమై స్పందిస్తూ- కాంగ్రెస్ అధిష్ఠానం- ‘రాజశేఖర రెడ్డి ఆస్తులు సంపాదించుకున్న మాట నిజమనీ- జగన్ దేవుడు విధించిన ఏ శిక్షకైనా అర్హుడేననీ’ కాస్త కఠినంగా అన్నట్లు సెప్టెంబరు 10 ఈ నాడు దినపత్రిక కథనం.
ఇది నిజమే ఐతే- “ఆ ముక్క నేను లెక్కెట్టుకోక మునుపు సెప్పాల” అన్న ముత్యాలముగ్గు డైలాగు గుర్తు చేసుకోవడం మినహా సామాన్య పౌరుడు ఏంచేయగలడు?
Like this:
Like Loading...
Related
Permalink
saamaanyudu said,
సెప్టెంబర్ 11, 2010 at 4:00 సా.
nijaM cheppaaru. suitcase lu andinappudu gurtulEdevariki. ayinaa enadu vaaru prajala cheeteela sommuto aadukoleda. tdp adhikaaraanni veellu durviniyogam cheyaledaa? 2000 ekaraalanu evari daggara koni studio kattaaru? chandrababu adhikaramlo undaga dubai vaallato vyaapaaralu share cheyaledaa? malasia lo hotel business lu pettaledaa? vela kotla rupayala world bank appulato techchina nidhulalo vaataalento intavaraku telchaaraa? anta gurivinda ginjale..
వసుంధర said,
సెప్టెంబర్ 11, 2010 at 4:39 సా.
నిజం చెప్పారు. అసామాన్యులందరూ కావాలని గురివిందలు. వారిని అసామాన్యుల్ని చేసినవారు అసహాయులమనుకునే నిర్లిప్తులు. ఇదీ ప్రస్తుతం మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐతే పత్రికల వ్యాఖ్యలకే వారి నేపధ్యం తీసుకోవాలి. వార్తలకు కాదు. ఆ వార్తలకు వ్యాఖ్యానం మనది. ప్రస్తుతానికి మన వ్యాఖ్యానాలది ఉడతాభక్తి. ఏనాటికో అవి మహత్తరశక్తిగా రూపొందగలవని ఆశ.
SRRao said,
సెప్టెంబర్ 11, 2010 at 3:47 సా.
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
వసుంధర said,
సెప్టెంబర్ 11, 2010 at 4:41 సా.
మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీకు మా వినాయకచవితి, రంజాన్ శుభాకాంక్షలు.
వసుంధర