అక్టోబర్ 22, 2010

కథలే కన్నానురా అక్టోబర్ 21, 2010

Posted in సాహితీ సమాచారం at 3:26 ఉద. by వసుంధర

అక్షరజాలం వీక్షకుల కథాపఠనానికి అనువుగా ఈ శీర్షికలో అడపాతడపా ఇంతవరకూ ఇచ్చిన లింక్సు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రచయిత్రులకోసం ఇటీవల వంగూరి ఫౌండేషన్, ఆంధ్రప్రభ- సంయుక్తంగా అంతర్జాతీయ కథల పోటీ నిర్వహించారు. ఈ పోటీ రచయిత్రులకు మాత్రమే పరిమితం కావడం విశేషం. ఇందులో బహుమతి పొందిన పది కథల్లో అక్టోబర్ 10 వరకూ  ప్రచురితమైన ఐదు కథలకు లింకు ఇక్కడ ఇస్తూ వీటిపై పాఠకుల స్పందన ఆహ్వానిస్తున్నాం. వసుంధర విశ్లేషణ నవంబర్ రచన మాసపత్రికలో వస్తుంది.
పథికుడు (పి. శాంతాదేవి)
మౌనమే నీ భాష (పి.వి. భగవతి)
మీకొద్దీ ముళ్లదారి (శ్రీదేవీ మురళీధర్)
అత్తమ్మా (రావులపల్లి రామలక్ష్మి)
ధర్మ సమ్మూడ చేతా పృచ్ఛామి (బి. గీతిక)
ఈ కథలకు లింక్సు- రచయిత్రి బి. గీతిక తెలుగులో నిర్వహిస్తున్న ప్రేమలో మనం అనే చక్కటి బ్లాగునుంచి  లభించాయి. ఈ బ్లాగులో ఇంతవరకూ ప్రచురితమైన గీతిక కథలు కూడా లభిస్తాయి. వాటి వివరాలు కింద ఇస్తున్నాం.
ధర్మ సమ్మూడ చేతా పృచ్ఛామి
నరుడా ఏమి నీ ఒక్క కోరిక
మనుషులు మారాలి
అమ్మకోసం
కు.రా.రా డైరెక్టర్ ఆఫ్ ది డైలీ సీరియల్స్
మనసా పలకవే
అమృతానందం
మంచెకాడపడక
ఇదివరలో రచన మాసపత్రికలో విశ్లేషించిన నరుడా ఏమి నీ ఒక్క కోరిక ను మినహాయిస్తే మిగతా కథలపై విశ్లేషణ కూడా నవంబర్ రచన మాసపత్రికలో వస్తుంది. గీతికకు ధన్యవాదాలు (పోటీ కథలను వీక్షకుల్ని అందజేసినందుకు), అభినందనలు (అర్థవంతమైన బ్లాగు నిర్వహిస్తున్నందుకు).

Leave a Reply

%d bloggers like this: