నవంబర్ 8, 2010

కథలే కన్నానురా నవంబర్ 8, 2010

Posted in సాహితీ సమాచారం at 11:42 సా. by వసుంధర

అక్షరజాలం వీక్షకుల కథాపఠనానికి అనువుగా ఈ శీర్షికలో అడపాతడపా ఇంతవరకూ ఇచ్చిన లింక్సు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఈ కింద ఇచ్చిన కథలన్నీ తప్పక చదువతగ్గవి. వీటిపై వీక్షకుల స్పందన ఆహ్వానిస్తున్నాం.
పాఠాంతరం (వాడ్రేవు చినవీరభద్రుడు)
రచయిత్రులకోసం ఇటీవల వంగూరి ఫౌండేషన్, ఆంధ్రప్రభ- సంయుక్తంగా అంతర్జాతీయ కథల పోటీ నిర్వహించారు. ఈ పోటీ రచయిత్రులకు మాత్రమే పరిమితం కావడం విశేషం. ఇందులో బహుమతి పొందిన పది కథల్లో అక్టోబర్ 10 వరకూ  ప్రచురితమైన ఐదు కథలకు లింకు గతంలో ఇచ్చాం. వీటిపై నవంబర్ రచనలో వచ్చిన వసుంధర విశ్లేషణకు ప్రేమలో మనం బ్లాగు చూడగలరు. అక్టోబర్ 24న ప్రచురితమైన అల్లూరి గౌరీలక్ష్మి “స్నేహసౌరభం” కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  ఈ కథను మాకు అందించిన బి. గీతికకు ధన్యవాదాలు,
రచన మాసపత్రిక నిర్వహించిన శ్రీ వేదుల జగన్నాథరావు- శ్రీమతి వేదుల రాజ్యలక్ష్మి స్మారక దీపావళి కథలపోటీలో బహుమతులందుకున్న గంధపు చెక్కలు, బంగారు పిచ్చుక, ఈ తాళి చాలు- కథలు నవంబర్ (2010) రచనలో ప్రచురితం. వసుంధర విశ్లేషణకు డిసెంబర్ రచన చూడగలరు.
కథల పరంగా మరో మంచి వెబ్ పత్రిక తెలుగు జ్యోతి. అందులో ప్రచురితమైన కొన్ని కథలకు కింద లింకు ఇస్తున్నాం.
కాలు విరిగిన కలదు సుఖం (నిడదవోలు మాలతి )
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ (చల్లా సత్యవతి)
అప్పుడు ఇప్పుడు (శ్యామలాదేవి దశిక)
హంసధ్వని-హింసధ్వని (జొన్నలగడ్డ శ్యామల)
మతిమరపు (భారతి భావరాజు)
పిచ్చితల్లి (నోరి రాధిక)
కుంతీ విలాపము (సాయిలక్ష్మి)
సరసకామేశం (సాయిలక్ష్మి)
ఈ కథలన్నింటిపై వసుంధర విశ్లేషణకై డిసెంబర్ (2010) రచన మాసపత్రిక చూడగలరు.

Leave a Reply

%d bloggers like this: