నవంబర్ 10, 2010

కనిపించని నాలుగోసింహం

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:28 సా. by వసుంధర

పత్రికల్లో మాకు నచ్చే అంశాల్లో ఉత్తరాలద్వారా పాఠకుల స్పందన ఒకటి. అంతర్జాలంలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అక్టోబర్ (2010) సంచికలో ప్రముఖ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు శ్రీ వీరాజీ ఉత్తరంలో ఆ పత్రిక ఆగస్ట్ సంచికలోని “ఆ పోరాటంలో కనిపించని నాలుగో సింహం” వ్యాసం ప్రస్తావన ఉంది.  శ్రీ వీరాజీ స్పందన పాఠకుల్ని ఆ వ్యాసం వైపు పరుగెత్తించేలా ఉంది. స్వాతంత్ర్య పోరాటకాలంలో ఉద్యమించిన పురుషులు కుటుంబాల్ని పట్టించుకోకుండా ఉద్యమంలో తలమునకలుకావడం,  జైళ్లపాలవడం సర్వసామాన్యం. అలాంటప్పుడు మగువలు భర్తల్ని నిరసించకుండా మొక్కవోని ధైర్యంతో- సమష్టి కుటుంబ నిర్వహణ, అత్తమామల పోషణ తమ బాధ్యతగా స్వీకరించడం అసామాన్యం, అలా స్వీకరించి పురుషులకు నైతికంగా మానసికంగా బలాన్నిచ్చి మద్దతుగా నిలిచిన మహిళల్ని కనిపించని నాలుగోసింహంగా అభివర్ణించారు వ్యాసకర్త. అలాంటి ఓ సింహానికి ప్రతినిధిగా ఇంకా మిగిలిఉన్న కొద్దిమంది గృహిణుల్లో శ్రీమతి గుండు లక్ష్మీనరసమ్మ గారి వయసిప్పుడు 99. ఆమె పాఠకులతో పంచుకున్న ఆన్నటి జ్ఞాపకాలు- ఆమె అసాధారణ వ్యక్తిత్వాన్ని పరిచయంచేస్తూ- నేటి తరానికి అత్యావశ్యకమైన ప్రేరణ ఔతాయి. 1981లో కన్నుమూసిన ఆమె భర్త శ్రీ గుండు వేంకటకృష్ణమూర్తి వ్యక్తిత్వం నేటి స్వార్థ, కలుషిత రాజకీయాలకు చెంపదెబ్బ. దేశాభిమానులైన ప్రతిఒక్కరూ చదివితీరాల్సిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకు అభినందనలు. లంకెలకు నీలిరంగు పదాలపై క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: