నవంబర్ 29, 2010

ముఖాముఖీ నవంబర్ 29, 2010

Posted in ముఖాముఖీ at 4:18 సా. by వసుంధర

ఏదాదిపాటు అమెరికాలో ఉన్నాక ఈ నవంబరు 13న తిరిగి తెలుగుతల్లి ఒడిలో వాలడం అపురూపమైన అనుభూతి. అంతర్జాలం అందుబాటులోకి రాక అక్షరజాలంలో ప్రవేశించడానికి ఈరోజుదాకా వేచి ఉండాల్సి వచ్చింది.
పంచుకునేందుకు ఒకటా, రెండా- ఎన్నో విశేషాలు. మన ముఖ్యమంత్రి స్థానం రోశయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి మారింది. ఆసియా క్రీడోత్సవాల్లో 14 స్వర్ణాలతో భారత్ ఎంతో మెరుగైన ప్రదర్శన చూపింది. క్రికెట్లో కొత్తవారు, పాతవారు, బోలర్లు, బట్స్‌మెన్- సరిసమంగా రాణిస్తూ- రానున్న ప్రపంచకప్‌పై ఆశలు పుట్టిస్తున్నారు. బీహార్లో నితీష్‌కుమార్ సానుకూలంగానూ, కర్ణాటకలో యెడియూరప్ప ప్రతికూలంగానూ- సంచలనాలు సృష్టించారు. సుప్రీంకోర్టు ప్రధాని అంతటివాణ్ణి మందలించగలిగితే, న్యాయాధికారుల అవినీతి మరోచోట గుప్పుమంటోంది.
ఇక సాహితీపరంగా ఎన్నో వేడుకలు, సమావేశాలూ, పోటీలు, సన్మానాలు, సత్కారాలు.
వీలువెంబడి మా స్పందన మీతో పంచుకుంటాం. మీ స్పందనకోసం ఎదురు చూస్తూంటాం.
ఎక్కడెక్కడ ఉన్నవారికీ తెలుగు వాణి ఆకశవాణి ద్వారా వినిపించడానికి అంతర్జాలంలో ఉన్న గొప్ప సదుపాయం voicevibes. అందుకు కారణభూయులైన శ్రీ రాజ్‌ని ప్రత్యేకంగా దానికి లింకు ఇక్కడ ఇస్తున్నాం. 
మళ్ళీ కలుద్దాం
వసుంధర

Leave a Reply

%d bloggers like this: