డిసెంబర్ 17, 2010

యూనికోడ్ నుంచి అనూకి

Posted in Uncategorized at 2:59 సా. by వసుంధర

మహేందర్ మొబైల్ నంబరు ఇప్పుడు 9347659906 కి మారింది. అందుకే ఈ టపాని మళ్లీ ప్రచురిస్తున్నాం.

తెలుగులో టైపు చేయడానికి ఇప్పుడు ఎన్నో రకాల సాఫ్ట్‌వేర్లున్నాయి. వాటిలో మాకు తెలిసినవి- లేఖిని, శ్రీలిపి, iLeap, బరహా, అను, Tamilcube వగైరా కొన్ని.  వీటిలో కొన్ని ఆంతర్జాలానికి అనుకూలమైతే, కొన్ని ఆందమైన ముద్రణకు అవసరం. టైపింగు నియమాలు సాఫ్ట్‌వేర్‌నిబట్టి మారుతూంటాయి కాబట్టి వ్రాసేవారు తమకు వీలైన ఒకే సాఫ్ట్‌వేర్‌ని ఎంచుకోవడం సహజం. నాలుగు రకాల సాఫ్ట్‌వేర్‌లో టైపు చేయగలవారు కూడా ఒకే matterని నాలుగుసార్లు టైపు చెయ్యడానికి ఇష్టపడరు. ఇదికాక ప్రస్తుతం ఎక్కువమంది Windows 7 వాడుతున్నారు. అది అను 7కే తప్ప అను 6కి అనుకూలం కాదు. కానీ ఇప్పటికీ ముద్రణకు చాలామంది అను 6నే వాడుతున్నారు.   ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని- మహేందర్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడు Telugu Text Convrting Utility పేరిట ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించాడు.
ఒక వెర్షన్‌లో టైపు చేసిన తెలుగు లిపిని మరో వెర్షన్ లిపిగా మార్చడానికి సహకరించే ఈ సాఫ్ట్‌వేర్ కల్పించగల మార్పిడి సదుపాయాలివి:
Anu Version 4 to 6 to 7
Anu Version 6 to 7
Anu Version 7 to 6
iLeap to Anu Version 6 or 7
Anu Version 6 or 7 to iLeap
Unicode (or Baraha) Text to Anu 6 or 7
Anu 6 or 7 to Unicode text
Shreelipi to Anu 6 or 7
ఇవికాక వినియోగదారులు కోరిన ప్రత్యేక మార్పిడులకు కూడా శ్రీ మహేందర్‌ని మొబైల్ నంబరు 9347659906 ద్వారా సంప్రదించవచ్చు. ఈ సదుపాయంవల్ల పొందుతున్న ప్రయోజనాలనుబట్టి చెల్లించే మూల్యం సరసమని మాకు తోచింది. త్వరలో శ్రీ మహేందర్ వివరాలను అక్షరజాలంలో ప్రకటించగలం.
తెలుగు సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు ప్రయోజనకరమైన సదుపాయాన్ని రూపొందించిన మహేందర్‌కి అభినందనలు.

7 వ్యాఖ్యలు »

  1. sudha said,

    nenu srilipi 6.0 lo word lo type chestanu…deenini anuloki ela convert cheyali……


Leave a Reply

%d bloggers like this: