Site icon వసుంధర అక్షరజాలం

సింగిల్ పేజీ ఉగాది కథల పోటీ- స్వప్న

సకుటుంబ సపరివార పత్రికగా ముప్పై సంచికలు పూర్తి చేసుకున్న స్వప్న మాసపత్రిక జనవరి సంచిక ప్రస్తుతం మార్కెట్లో ఉంది. పాఠకుల ఉత్తరాలను `తీర్పు’గా భావించే ఈ పత్రికలో- ప్రతి నెలా ఓ మంచి ఉత్తరాన్ని `మనసులో మాట’గా ప్రచురించి- 75 రూపాయలు పారితోషికం ఇస్తున్నారు. నడుస్తున్న నాలుగు ధారావాహికల్లో ఒకటి మల్లాది వెంకటకృష్ణమూర్తి సాహితీవ్యాసంగంలో `జరిగిన కథ’. మరొకటి కొమ్మూరి సాంబశివరావు `లాకెట్ మర్మం’. ఏడు కథలున్నాయి: వాటిలో రెండు అరనిముషం కథలు, రెండు సింగిల్ పేజీ కథలు. ఆసక్తికరమైన శీర్షికల్లో రాజకీయాలు, విదురనీతి ఆలోచింపజేస్తాయి. పండుగ వంటలు నోరూరింపజేస్తాయి.  సంస్కృతి, సంప్రదాయం పట్ల అవగాహన కలిగించే శీర్షికలు కొన్ని. రాశి ఫలాలు, సుఖసంసారం, స్వప్న`సుందరి’- పాఠకుల అభీష్ఠాన్ననుసరించినవి. `జీవనచిత్రం’ సమకాలీన జీవితాన్ని ప్రయోజనాత్మకంగా విశ్లేషిస్తే, `కొంటె కోణంగి సమాధానాలు’ జీవితాన్ని చమత్కరిస్తూ- ఓ మంచి ప్రశ్నని 150 రూపాయలతో సత్కరిస్తుంది. `స్వప్నలోక విహారం”- నేటి చలనచిత్రాల వివరాల్ని ప్రత్యేకశైలిలో అందిస్తే- `గతస్మృతులు’, `సినీ పదనిసలు’ చలనచిత్రరంగానికి సంబంధించిన అరుదైన విశేషాలు. `కంచికి చేరని కథలు’ పాఠకులని చేరాలన్న మంచి ప్రయత్నం ఈ నెలే మొదలైంది. ఇంకా పరిజ్ఞానాన్ని పెంచే `కలగూరగంప’, నవ్వించే కార్టూన్లు_జోక్సు, కవ్వించే గళ్లనుడికట్టు, పుస్తక పరిచయాలు వగైరాలతో నిండిన ఈ సంచిక వెల పది రూపాయలు. శ్రీ డి.ఎల్.వి. రామారావు సంపాదకత్వంలో ఆకర్షణీయంగా రూపొందుతున్న ఈ పత్రికలో వచ్చే నెలనుంచి అపురూపమైన ఆరుద్ర డిటెక్టివ్ కథలు ఆరంభం కానున్నాయి.
ప్రచురించే కథలు వ్రాతప్రతిలో ఫుల్ స్కేప్ సైజులో ఆరు పేజీలకు మించకూడదని రచయితలకు వారి మనవి. రచనలు, చందా పంపవలసిన చిరునామా: Sterling Media & Entertainment, 3/2 North Usman Road, T Nagar, Chennai 600 017. Ph: 044-42122158; email: swapnamag@gmail.com
ఆంధ్రప్రదేశ్‌లో `స్వప్న’ పంపిణీదారులు: ఆనంద్ ఏజన్సీస్, స్ర్టీట్ నెం: 10, శివ మెడికల్స్ పైన, చిక్కడపల్లి, హైదరాబాద్
మొబైల్: 9848428516/9848249695
నేరుగా స్వప్నని సంప్రదించడానికి: జి. రామారావు, జనరల్ మేనేజర్, ఫోన్: 044-42122158/09281038775
ఉగాది సందర్భంగా స్వప్న నిర్వహిస్తున్న `సింగిల్ పేజీ ఉగాది కథల పోటీ’ వివరాలివి:
పోటీ: టి.వి. లక్ష్మి_ `ప్రతిభా’ శాస్త్రి పురస్కారం
మూడు బహుమతులు: మొదటిది రూ 2,5౦౦; రెండవది రూ 1,5౦౦; మూడవది రూ 1,౦౦౦.

ముఖ్య నిబంధనలు: కాగితానికి ఒకవైపునే వ్రాయాలి; రెండు ఫుల్‌స్కేప్ పేజీలకి మించకూడదు; అనువాదాలు, అనసరణలు పనికిరావు.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2011


Exit mobile version