జనవరి 31, 2011

దాసరి సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సమావేశం

Posted in సాహితీ సమాచారం at 2:16 సా. by వసుంధర

చందమామకూ, చందమామ రచనలకూ విశిష్టతను ఆపాదించినవారిలో ముఖ్యులైన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం వివరాలు అక్షరజాలంకి సుపరిచితమే. ఆ అజ్ఞాత రచయిత 2010 జనవరి 27న అజ్ఞాత లోకాలకు తరలి వెళ్లారు కదా- ఆయన ప్రథమ వర్ధంతి సమావేశం ఈ జనవరి 27న హైదరాబాదులో జరిగింది. కబురే తప్ప పిలుపు లేకపోవడం, వచ్చినవారే తప్ప రప్పించినవారు లేకపోవడం-  ఈ సభ ప్రత్యేకత. అలాంటప్పుడు సాహిత్యాభిమానం తప్ప మరే ఆర్భాటమూ లేకపోవడం సహజం కదా! ఈ సభా పరిమళాలను ఆఘ్రాణించడానికి- చందమామ సంపాదకులు రాజశేఖరరాజు చేసిన ఏర్పాట్లకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
దాసరి రచనల్లొ కొన్నింటిని మూడు పుస్తకాలుగా ఈ వర్ధంతి సభలో ఆవిష్కరించారు. త్వరలోనే వాటినిక్కడ పరిచయం చెయ్యగలం.

1 వ్యాఖ్య »

  1. పిఆర్ తమిరి said,

    Kaburu, pilupu rendu leni lotu teerchaaru….Dhanyavaadaalu….


Leave a Reply

%d bloggers like this: