వసుంధర అక్షరజాలం

బాపు వెబ్‌సైట్

2009 నవంబర్ 15న అసమాన ప్రముఖ చిత్రకారుడు బాపు వెబ్‌సైట్ గురించి శ్రీ విజయవర్ధన్ నుంచి మాకీ మెయిల్ అందింది. అక్షరజాలంలో ఉంచడానికి అనుకోకుందా ఆలస్యమైంది. త్వరలో బాపు-రమణల “కోతి కొమ్మచ్చి”ని కూడా పరిచయం చెయ్యగలం.

శ్రీ విజయవర్ధన్ లేఖ:

బాపు అభిమానులకు ఒక శుభవార్త. బాపు గారి కోరిక మేరకు నా మిత్రుడు రవి శంకర్ ఒక web site నిర్మించాడు. ఇకపైన బాపు గారి బొమ్మలన్నీ ఈ site ద్వారా కొనుక్కోవచ్చు. బాపు గారి బొమ్మలను బాపు గారి అనుమతి లేకుండా పలువురు అమ్ముతున్నారని, బాపు గారే ఈ web site ద్వారా బొమ్మలను అందుబాట్లోకి తెస్తున్నారు. ఈ web site గురించి బాపు గారి మాటల్లోనే వినవచ్చు (క్రింద జత చేసిన videoలో చూడవచ్చు). ఈ విషయం మీ మిత్రులందరికీ తెలియపరచండి. అనధికారిక అమ్మకాలను నిలువరించటంలో తోడ్పడండి. వీలైతే మీ బ్లాగులో ఈ విషయం ప్రచురించండి. బాపు గారి videos మీ బ్లాగులో పెట్టడానికి వీలుగా embed code క్రింద జత పరిచాను.

Web site గురించి చెబుతున్న బాపు గారు (తెలుగులో).

 

Web site గురించి చెబుతున్న బాపు గారు (Englishలో)

 

 

Exit mobile version