ఫిబ్రవరి 7, 2011

ఉగాది కథల పోటీ- పొద్దు

Posted in కథల పోటీలు at 5:12 సా. by వసుంధర

ఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా కథల పోటీని నిర్వహించాలని పొద్దు అంతర్జాలపత్రిక సంకల్పించింది.ఈ సందర్భంగా రచయితలు, రచయిత్రులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ పోటీ యొక్క నిబంధనలివి:

1.     ఇతివృత్తం, నిడివి వంటి విషయాల్లో పట్టింపులేమీ లేవు.

2.     రచన అప్రచురితమూ, సొంతమూ అయిఉండాలి.

3.     కథతో పాటు రచయిత సంక్షిప్త పరిచయము, ఫోటో, హామీ పత్రము జతచేసి పంపాలి

4.     చివరితేదీ: మార్చి 15.

5. బహుమతి పొందినవి కాక, ఇతరకథల్లో అర్హమైన వాటిని రచయితకు తెలియజేసి సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము.

6.     బహుమతులు పొందిన కథలతోపాటు సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలను ఉగాది నుండి వరుసగా ప్రచురిస్తాము.

7.     కథను యూనికోడులో టైపించి editor@poddu.net మెయిల్ ఐడీకి ఈమెయిలు చెయ్యాలి.

8.     పోస్ట్ ద్వారా పంపదలచిన వారు  కింది చిరునామాకి పంపాలి.
తుమ్మల శిరీష్ కుమార్,
201,
రాజ్యలక్ష్మి ఆర్కేడ్,
వివేకానందనగర్,
కూట్ పల్లి,
హైదరాబాద్
పిన్: 500072
ఫోన్: 9866236956

9.     బహుమతులు

 

అత్యుత్తమ కథ

కినిగె పుస్తక భాండాగారం  (kinige.com) లో సంవత్సరం పాటు ఉచిత సభ్యత్వం

మరియు

సీ పీ బ్రౌన్ ఎకాడమీ వారి సాహితీ స్రవంతి పత్రికకు సంవత్సర చందా.

ద్వితీయ ఉత్తమ కథ

కినిగె పుస్తక భాండాగారంలో ఆరునెలల పాటు ఉచిత సభ్యత్వం

మరియు

పత్రిక మాసపత్రికకు సంవత్సర చందా

తృతీయ ఉత్తమ కథ

కినిగె పుస్తక భాండాగారంలో మూడునెలల పాటు ఉచిత సభ్యత్వం

మరియు

ఇటీవలి తెలుగు కథల సంకలనం

నవవసంతశోభను ఇనుమడింపజేసే మీ కథాకూజితాల కోసం పొద్దు ఎదురుచూస్తోంది.
మరిన్ని వివరాలకు పొద్దు పత్రిక (poddu.net/?q=node/797) చూడండి.

 

శుభాకాంక్షలతో,

పొద్దు  (poddu.net)

Leave a Reply

%d bloggers like this: