ఫిబ్రవరి 7, 2011

ఉగాది కథానికల పోటీ- నవ్య

Posted in కథల పోటీలు at 2:23 సా. by వసుంధర

నవ్య వారపత్రిక- ఫిబ్రవరి 9 (2011) సంచికలో- ఉగాది కథల పోటీ ప్రకటించింది. ఈ పోటీ శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్-నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ప్రథమ బహుమతి: రూ 8,000
ద్వితీయ బహుమతి: రూ 5,000
2 తృతీయ బహుమతులు (కథ ఒక్కింటికి): రూ 3,000
11 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి): రూ 2,000
నిబంధనలు:
1. కథ తెలుగు వారి జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి.
2. ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా నేపధ్యం కావచ్చు. కథ తెలుగువారి జీవితానికి సంబంధించివదై ఉండాలి.   .
3. రచయిత(త్రి) పేరు, పూర్తి చిరునామా- కథతోపాటు కాక వేరే కాగితంపై వ్రాయాలి. హామీపత్రం విధిగా జతపర్చాలి.
4. అరఠావు సైజులో 10 పేజీలు, డి.టి.పి చేసిన పక్షంలో 6 పేజీలు మించకూడదు. కవరుమీద “నవ్య వీక్లీ ఉగాది కథానికల పోటీకి” అని వ్రాయాలి.
5. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపబడవు.
6. బహుమతి పొందిన కథానికలతో సంకలనం వెలువడే అవకాశం ఉంది.
చిరునామా: నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోథి బిల్డింగ్స్, ఫ్లాట్ నెం. 76, రోడ్ నెం. 70, అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500 033
ముగింపు తేదీ: మార్చి 31, 2011

Leave a Reply

%d bloggers like this: