ఫిబ్రవరి 14, 2011

హంసిని ఉగాది తెలుగు ఉత్తమ రచనల పోటీ

Posted in కథల పోటీలు at 3:55 సా. by వసుంధర

“శ్రీ ఖర” నామ సంవత్సర ఉగాది సందర్భంగా హంసిని వారు ఉగాది తెలుగు ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. దేశ విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనమని ఆహ్వానిస్తున్నారు. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.
ఉత్తమ కథానిక (మొదటి బహుమతి) : $116
ఉత్తమ కథానిక (రెండవ బహుమతి) : $51
ఉత్తమ కథానిక (మూడవ బహుమతి) : $51
ప్రచురణార్హమైన కథానికలు: $10

ఉత్తమ కవిత : (మొదటి బహుమతి): $51
ఉత్తమ కవిత: (రెండవ బహుమతి): $51
ఉత్తమ కవిత: (మూడవ బహుమతి): $51
ప్రచురణార్హమైన కవితలు: ప్రశంసాపత్రం

పోటీలకీ ముఖ్య గమనికలు:

* నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును.
* ఆదునిక కధ/కవిత, ఇతర కధ/కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.
* రచన చేరవలసిన ఆఖరి రోజు మార్చ్ 31, 2011.
* ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ రెండు ఎంట్రీలు పంపించవచ్చును.
* కధ వ్రాత ప్రతిలో పది పేజీల లోపు ఉంటే బావుంటుంది, కవిత రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.
* రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు.
* బహుమతి  పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు హంసిని వెబ్ పత్రికలో ప్రచురించబడతాయి.
* ఫలితాలు ఏప్రిల్ 30, 2011 గాని అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి .
* కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోపుగా రచయితలు తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.
* విజేతల ఎన్నికలో హంసిని నిర్వాహకులదే తుది నిర్ణయం.
* రచనల్ని పిడిఎఫ్ లేక యూనికోడ్ ఫాంట్స్ లో hamsini@andhraheadlines.comకి పంపాలి.

Leave a Reply

%d bloggers like this: