ఫిబ్రవరి 15, 2011
తెలుగు ఉగాది ఉత్తమ రచనల పోటీ- వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
Posted in కథల పోటీలు at 11:23 ఉద. by వసుంధర
గత 15 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “శ్రీ ఖర” నామ సంవత్సర ఉగాది ((ఏప్రిల్ 4, 2011) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 16వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. విదేశాలలో తెలుగు భాషనీ, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ, మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనమని ఆహ్వానిస్తున్నారు. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.
ఉత్తమ కథానిక: (రెండు బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
నా మొట్ట మొదటి కథ: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
నా మొట్ట మొదటి కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
గత సంవత్సరం జరిగిన 15వ ఉగాది పోటీలో ప్రవేశపెట్టిన “నా మొట్టమొదటి కథ” ప్రక్రియకి మంచి స్పందన వచ్చిన స్పూర్తితో ఈ సంవత్సరం కూడా ఆ ప్రక్రియలో పోటీని కొనసాగిస్తూ, “నా మొట్టమొదటి కవిత” అనే నూతన ప్రక్రియలో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆధునిక కవిత, ఛందోబధ్ధమైన కవితలూ, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే. కథలూ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తమ మొట్టమొదటి రచనగా పేర్కొంటూ, నూతన రచయితలందరినీ ఈ రెండు ప్రక్రియలలోనూ తమ అముద్రిత స్వీయ రచనలని పంపించమని కోరుతున్నారు. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులనూ, కవులనూ, కవయిత్రులనూ ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నారు.
ముఖ్య గమనికలు
· అన్ని రచనలూ చేరవలసిన ఆఖరి రోజు మార్చ్ 4, 2011.
· ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది.
· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
· విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు.
· బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది అంతర్జాల పత్రికలోనూ, “రచన” మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, వారి నిర్ణయానుగుణంగానూ ప్రచురించబడతాయి.
· ఫలితాలు ఉగాది పర్వదినాన (ఏప్రిల్ 4, 2011) కానీ అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోపుగా తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని రచయితలను కోరుతున్నారు.
· విజేతల ఎన్నిక లోనూ, ఇతర విషయాలలోనూ నిర్వాహకులదే తుది నిర్ణయం.
Like this:
Like Loading...
Related
Permalink
_వంగూరి చిట్టెన్ రాజు said,
ఫిబ్రవరి 15, 2011 at 12:36 సా.
మా ప్రకటనని వెనువెంటనే ప్రచురించి, ఎంతో సహాయపడుతున్న మీ ఆదర్శ దంపతులకు ఎంతో ఋణపడి ఉన్నాం.
మీకు నా వ్యక్తిగత, సంస్థాగత ధన్యవాదాలు.
_వంగూరి చిట్టెన్ రాజు
హ్యూస్టన్, టెక్సస్.
వసుంధర said,
ఫిబ్రవరి 17, 2011 at 8:16 ఉద.
తెలుగుకీ, సాహిత్యానికీ ప్రోత్సాహాన్నివ్వడం బాధ్యతగా స్వీకరించి నిర్వహిస్తున్నారు మీరు, మీ సంస్థ. అభినందనీయమైన మీ అపరిమిత వ్యయప్రయాసల గురించి- తెలిసిన మేరలో పరిమితమైన మా పరిధిలో ప్రచారం చేయడం బాధ్యతగా భావిస్తాం. మీ స్పందనకు ధన్యవాదాలు.