ఫిబ్రవరి 21, 2011

కవితల పోటీలు

Posted in కథల పోటీలు at 8:44 సా. by వసుంధర

శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్రస్థాయి శ్రీ “ఖర” నామ సంవత్సర ఉగాది కవితల పోటీ నిర్వహించుతున్నది.
బహుమతులు:
ఉత్తమ కవిత రూ 1000/-
రెందవ ఉత్తమ కవిత రూ 750/-
మూడవ ఉత్తమ కవిత రూ 500/-
10 ఉత్తమ కవితా ప్రోత్సాహక బహుమతులు.
నిబంధనలు
1. కవితలతో పాటు శ్రీ “ఖర” నామ సంవత్సర ఉగాది కవితల పోటీకి ప్రత్యేకించి వ్రాసినదనే హామీపత్రం జతపర్చాలి.
2. అంశం 20 పంక్తులకు మించకుండా సామాజిక స్పృహ కలిగినదై ఉండాలి.
3. ప్రవేశ రుసుముగా రూ 100/- లంకా వెంకట సుబ్రహ్మణ్యం పేరిట దిగువ చిరునామాకు డిడి రూపంలో పంపాలి. ఇది వాపసు ఇవ్వబదదు.
4. విజేతలు హైదరాబాదులో జరుగు సభకు వచ్చి పురస్కారం స్వీకరించాలి. రానిచో పురస్కారం రద్దు చేయబడుతుంది.
5. కవితలు పంపే కవరుపై శ్రీ “ఖర” నామ సంవత్సర ఉగాది కవితల పోటీకి అని వ్రాయాలి.
6. ఒరిజినల్ కవితతో పాటు అదనంగా  3 జిరాక్సు కాపీలు పంపాలి. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఫొటో వెనుక పేరు వ్రాసి జతపర్చాలి.
7. బహుమతి పొందని కవితలు తిప్పి పంపబదవు.
8. కవితలు తల్ల కాగితంపై ఒక పక్క మాత్రమే వ్రాయాలి. డిటిపి చేసి కూడా పంపవచ్చు.
9. హైదరాబాదులో ఏప్రిల్ 2011లో సభ జరుగుతుంది. సభ జరిగే తేది, సమయం అభ్యర్ధులు ఇచ్చిన ఫోన్ నంబరుకి ముందుగా తెలియజేయబడుతుంది.
10. ప్రవేశ రుసుము, కవితలు పంపవలసిన చిరునామా:
లంకా వెంకట సుబ్రహ్మణ్యం
అధ్యక్షులు, శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య
ప్లాట్ నెం. 308, శ్రీ మణికంఠ అపార్ట్‌మెంట్స్,
కళ్యాణ్ నగర్, ఈస్టు ఆనంద్ బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్ 500 047  మొబైల్: 94404 48650

ముగింపు తేదీ: ఫిబ్రవరి 28, 2011.

2 వ్యాఖ్యలు »

  1. Vijay said,

    maree 1000 prize ki 100 rusumu entandi. r u sure whether this is a genuine one ?

    • ఈ ఫిబ్రవరి 11న – శ్రీ కిరణ్ సంస్కృతిక సమాఖ్య త్యగరాజ గానసభలో 2010 రాష్ట్రస్థాయి కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సభను నిర్వహించింది. ముఖ్య అతిథి డా. సి. నారయణరెడ్డి. సభాధ్యక్షులు: శ్రీ సుధామ. ఆ సభకు మాకు ఆహ్వానం అదింది కానీ వెళ్లలేదు. ఈ పోటెలకు విధించిన షరతులు ఆమోదయోగ్యం అనిపించకపోయినా- ఆసక్తి ఉన్నవారు నమ్మవచ్చునని స్వాభిప్రాయం. మొబైల్ నంబరు కూడా ఉన్నది కాబట్టి సందేహాలుంటే నేరుగా సంప్రదించవచ్చు.


Leave a Reply

%d bloggers like this: