ఫిబ్రవరి 25, 2011

రమణీయ రమణాయణం కోతికొమ్మచ్చి

Posted in పుస్తకాలు at 9:25 ఉద. by వసుంధర

అవతారపురుషుల్లో రామలక్ష్మణులు, బలరామకృష్ణుల జంట ప్రత్యేకం. స్వభావాలు భిన్నమైనా- ఇద్దరిదీ ఒకేమాట, ఒకే బాట. దైవదత్తమనతగ్గ గీత-రాతల బాపు-రమణలదీ అదే ప్రత్యేకత. ‘కాడి ఎడ్లు కలవ్వు కానీ కలిసి నడుస్తాయి’. కళా వ్యవసాయంలో కాడి ఎడ్ల వంటి వీరిద్దరి ఒకే కథ, ఇద్దరికీ ఓకే కథ- బాపూరమణీయం ‘కోతికొమ్మచ్చి‘.
చరితార్ధుల స్వీయచరిత్ర కాబట్టి ఇది జాతి చరిత్ర. జాతిని ప్రభావితం చేసిన అన్ని రంగాల సమకాలీన మహానుభావుల్నీ మానవతాదృక్పథంతో అపురూపంగా స్పృశించిన పవిత్ర. జాతి మనుగడకీ, ప్రక్షాళనానికీ, ప్రగతికీ  అత్యావశ్యకమైన సంఘటనల్ని వాస్తవదృక్పథంతో విశ్లేషించిన మహత్తర సూచిక. వ్యాఖ్యానానికి వేల పేజీలు చాలని కావ్యసాగరం. పిహెచ్‌డి డిగ్రీకీ, రీసెర్చి వ్యాసాలకీ అనువైన ఉద్గ్రంథం. రామాయణం ఏడు కాండలైతే- రమణాయణం ‘కోతికొమ్మచ్చి’, ‘(ఇం)కోతికొమ్మచ్చి’,  ‘ము-క్కోతికొమ్మచ్చి’ అనే మూడు కాండలు. వాటిలో ప్రస్తుతానికి లభ్యమైన రెండు కాండలపై వసుంధర సమిష్టి సమీక్షకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

Leave a Reply

%d bloggers like this: