మార్చి 1, 2011

చిత్ర మాసపత్రిక హారర్ (భయానకం) కథల పోటీ

Posted in కథల పోటీలు at 8:59 సా. by వసుంధర

స్వదేశంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ (బాణామతి), యండమూరి వీరెంద్రనాథ్ (తులసిదళం) ప్రభృతులు, విదేశాలలో ఎడ్గార్, అలెన్‌సో, స్టీఫెన్ కింగ్, మేరీ షెల్లీ, వాంస్ట్రోకర్‌లను ఆదర్శంగా సూచిస్తూ- దేవుడు-దెయ్యం ఆత్మ లపై ఊహలను ప్రస్తావిస్తూ- చిత్ర మాసపత్రిక హారర్ కథల పోటీ నిర్వహిస్తున్నట్లు మార్చి సంచికలో ప్రకటించింది.
ప్రథమ బహుమతి:          రు. 5,000
ద్వితీయ బహుమతి:        రు. 3,000
తృతీయ బహుమతి:        రు. 2,౦౦౦
5 విశేష బహుమతులు (కథ ఒక్కింటికి):    రు. 1,౦౦౦
నిబండనలు:
1. అరఠావు సైజులో పేజీకి 25 వాక్యాలు మించకూడదు. డిటిపిలో ఐతే 6 పేజీలు  మించకూడదు. వ్రాత నకళ్లు పంపకూడదు.
2. రచన చివర పేజీలో రచయిత/త్రి పూర్తి పేరు (కలం పేరుతో వ్రాస్తే అసలు పేరు), పూర్తి చిరునామా, ఫోన్ నంబరు వ్రాయాలి. కవరుమీద్ హారర్ కథల పోటీకి అని స్పష్టంగా  వ్రాయాలి.
3. హామీపత్రం ఉండాలి. ప్రచురణకి స్వీకరించని వాటిని తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు జతపర్చాలి.
4. కథలో మార్పులు, చేర్పులు, కుదింపులకు- సంపాదకవర్గానికి పూర్తి హక్కు ఉంది.
5. ముగింపు తేదీ: మే 31, 2011
6. కథలు పంపాల్సిన చిరునామా: హారర్ కథల పోటీ, సంపాదకుడు, చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక, ఎస్.ఎఫ్-4, సూర్యసత్య అపార్ట్మెంట్స్, రెవెన్యూ కాలనీ, లబ్బీ పేట, విజయవాడ  520 010

Leave a Reply

%d bloggers like this: