మార్చి 4, 2011

అనిల్ అవార్డ్ కథల పోటీ

Posted in కథల పోటీలు at 2:27 సా. by వసుంధర

మానవ సంబంధాలలోని చీకటి వెలుగుల కోణాలను హృద్యంగా ఆవిష్కరింపజేసి, చదవాలనే కాంక్షను బలంగా కలిగించి, చదివాక ఆలోచింపజేస్తూ మళ్లీ మళ్లీ చదివించే మంచి కథలను ఆహ్వానిస్తూ స్వాతి మాసపత్రిక ఏప్రిల్ (2011) సంచికలో అనిల్ అవార్డ్ కథల పోటీ ప్రకటించింది.
రూ 25000 బహుమతి. సాధారణ ప్రచురణకు తీసుకున్న ప్రతి కథకూ రూ 1000.
నిబంధనలు:
1. అరఠావు సైజులో 10 పేజీలు మించకూడదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రితం- అని స్వదస్తూరీతో వ్రాసిన హామీపత్రం జతపర్చాలి.
3. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపాలంటే- తగినన్ని స్టాంపులు అతికించిన కవరుపై స్వంత చిరునామా వ్రాసి జత పర్చాలి.
4. కవరుమీద “అనిల్ అవార్డ్ కథలపోటీకి” అని వ్రాయాలి
చిరునామా: ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002
ముగింపు తేదీ: ఏప్రిల్ 30, 2011

Leave a Reply

%d bloggers like this: