మార్చి 5, 2011

ఉగాది కథల పోటీ- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 1:59 సా. by వసుంధర

రానున్న ఉగాది సందర్భంగా ఆంధ్రభూమి దినపత్రిక కథల పోటీ నిర్వహిస్తోంది.

మొదటి బహుమతి: రూ 10,000/-
రెండవ బహుమతి: రూ 5,000/-
మూడవ బహుమతులు (2): రూ 2,500/-
ప్రోత్సాహక బహుమతులు (5): రూ 1,000/-

ఇతివృత్తం ఏదైనా భాషలో, శైలిలో, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యం. ఈ కాలపు జీవన రీతికి, ఈ తరం అభిరుచులకు, మారుతున్న విలువలకు, అద్దంపట్టే రచనలకు స్వాగతం. హాస్యమా, శృంగారమా, మరొకటా అన్న రస పట్టింపులేదు. సందర్భానుసారంగా సంభాషణల్లో అక్కడక్కడ మాండలికం ఫరవాలేదు. కాని మొత్తం రచనంతా మాండలికంలో వద్దని మనవి.
కథ నిడివి ఆదివారం అనుబంధంలో రెండు పేజీలకు, భూమికలో శనివారం కథకిచ్చే చోటుకు సరిపోయేలా ఉండాలి. మామూలు దస్తూరిలో 6నుంచి 8 పేజీలు రాస్తే చాలు. (డి.టి.పి. చేసి పంపితే 4 సైజులో 3-4 పేజీలు). నిడివి మరీ ఎక్కువగా ఉన్న రచనలను ఎంత బాగున్నా పరిశీలించరు
రచన మొదట్లోనూ, చివరనా రచయిత పేరు (కలం పేరు వాడితే అసలు పేరు), చిరునామా, ఫోన్ నెంబరు స్పష్టంగా రాయాలి. కాగితానికి ఒక వైపే రాయాలి. రచన తమ సొంతమనీ, దేనికీ అనుకరణ, అనుసరణ కాదని, వేరే పోటీకి పంపలేదని, ఇంకే పత్రిక పరిశీలనలో లేదని హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. ఇష్టమైతే ఫొటోకూడా పంపవచ్చు.
గతంలో ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలకు పంపితే తిరిగొచ్చినది మళ్లీ పంపకూడదు. జిరాక్స్ కాపీలు, కార్బన్ కాపీలు పరిశీలించడం కుదరదు.
బహుమతి పొందిన రచనలను ఆంధ్రభూమి దినపత్రిక, ఆదివారం అనుబంధం, భూమిక సప్లిమెంట్లలో ప్రచురిస్తారు.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన వాటిని భూమికలోగాని, ఆదివారం అనుబంధంలో గాని ప్రచురించవచ్చు.
ప్రచురణకు స్వీకరించని రచనలను తిప్పి పంపాలంటే తగిన స్టాంపులను అతికించి చిరునామా రాసిన కవరును జతపరచాలి. స్టాంపులు, కవరు విడివిడిగా పంపితే గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
పోటీకి సంబంధించిన అన్ని అంశాలమీద సంపాదకునిదే తుది నిర్ణయం. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదు.
పోటీ ఫలితాలు ఆంధ్రభూమి దినపత్రికలో ఏప్రిల్ మొదటివారంలో వెలువడతాయి.
కవరు మీద ఉగాది కథల పోటీకి అని తప్పనిసరిగా రాయాలి.
కథలు చేరడానికి ఆఖరు తేది: 20 మార్చి 2011
abeditor@deccanmail.com
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

Leave a Reply

%d bloggers like this: