మార్చి 24, 2011
బాల బండారం
ఏ వేళలోనైనా చదవడానికి బాగుండేవి పిల్లల కథలు. వాటిలో ప్రయోజనాన్ని ఇమిడ్చితే- అవి హోమియోపతీ మాత్రల్లా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మన ప్రాచీన సాహిత్యకారులు ఇది గుర్తించారు. సమకాలీనంగా చందమామ వంటి పత్రికలూ ఈ పంథానే అనుసరిస్తున్నాయి. బాల సాహిత్యం ఆలోచనాత్మకంగా, ప్రయోజనకరంగా, రసమయంగా ఉండాలని నమ్ముతూ- అటువంటి కథలకు వేదికగా బాల బండారం అనే శీర్షికను అక్షరజాలంలో ప్రారంభిస్తున్నాం. ఈ వేదికని అలంకరించే తొలి కథా రచయిత ఇంటి పేరు బండారు కావడం శుభ సంకేతం. ఈ వేదికపై అభిప్రాయాల్నీ, వేదికకై కథల్నీ ఆహ్వానిస్తున్నాం.
బాల బండారం అల్లెం తినే అల్లుడు అన్నాతమ్ముల కథ ఒకటి మడత మాటలు ఒక జాగిర్దారు కథ రాజు-ప్రజలు ఏం బొమ్మ తెచ్చావ్ పిత్రోత్సాహం
Shri said,
జూలై 15, 2012 at 11:55 ఉద.
అల్లెం తినే అల్లుడు కథ చాలా వినోదాత్మకంగా సాగి ,చివర్లో ఆలోచనాత్మకంగా ముగిసింది.
ప్రభుత్వాలను అత్తా-అల్లుళ్ళతో పోల్చటం బాగున్నది.రచయితకు అభినందనలు.
శ్రీదేవి
r.damayanthi said,
మార్చి 28, 2011 at 3:48 సా.
ఉగాది నాటికి కవితల పోటీ ప్రకటించినవారి వివరాలు ఇంకా మీ దగ్గర వున్నయా?
అలాగే నాటికల పోటీల వివరాలు మీకేమైనా తెలిస్తే చెప్పగలరు.
కృతజ్ఞతలతో-
ర్ద్.
వసుంధర said,
మార్చి 30, 2011 at 7:52 ఉద.
ప్రస్తుతానికి హంసిని వెబ్ పత్రికలో పోటీకి మాత్రం ఇంకా (మార్చి 31) గదువున్నది. వివరాలకు ఈ కింద లంకెపై క్లిక్ చెయ్యండి.
http://aksharajalam.wordpress.com/2011/02/14/%E0%B0%B9%E0%B0%82%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4/