ఏప్రిల్ 4, 2011

ఆంధ్రభూమి ఉగాది కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 12:38 సా. by వసుంధర

పోటీల గురించీ, ఫలితాల గురించీ ఎప్పటికప్పుడు మున్ముందుగా సమాచారం అందజేస్తున్న అరిపిరాల సత్యప్రసాద్, సత్యాజీలకు మునుముందు ధన్యవాదాలర్పిస్తూ- ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీ ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం.
పదివేల రూపాయల ప్రథమ బహుమతి ఇవ్వదగ్గ కథ ఏదీ కనపడలేదు.
ద్వితీయ బహుమతి: రూ.5000 వంతున ఇద్దరికి
సంకోజి దేవేంద్రాచారి, డాక్టర్ ఎల్.కె.సుధాకర్
తృతీయ బహుమతి: రూ.2,500 వంతున నలుగురికి
అల్లూరి గౌరీలక్ష్మి, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎ పుష్పాంజలి, చిత్తలూరి సత్యనారాయణ
ప్రోత్సాహక బహుమతులు: రూ.1,000 చొప్పున అయదుగురికి
మంతెన సత్యనారాయణ, జొన్నలగడ్డ రామలక్ష్మి, గంటి రమాదేవి, పి చంద్రశేఖర అజాద్, లావణ్య దేవరకొండ
విజేతలకి అభినందనలు.
బహుమతి పొందిన కథలను ఆదివారం అనుబంధంలో, శనివారం భూమికలో వీలువెంబడి ప్రచురిస్తారు. సాధారణ ప్రచురణకి ఎంపిక అయిన కథల జాబితా ఏప్రిల్ 11 సాహితి అనుబంధంలో వస్తుంది.

అంతర్జాలంలో ఫలితాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి

Leave a Reply

%d bloggers like this: