Site icon వసుంధర అక్షరజాలం

పాడుతా తీయగా- ఈటివి

సరిగమప పేరిట జీ టివి, సూపర్ సింగర్స్ పేరిట మా టివి-  తెలుగునాట గాయనీ గాయకుల ఉత్పత్తికి తమ వంతు ప్రత్నం చేస్తున్నాయి. ఐతే అన్నింటికీ తలమానికంగా ఉన్నది ఈటివిలో వచ్చే పాడుతా తీయగా అని స్వాభిప్రాయం. పాల్గొనేవరి ప్రతిభా ప్రదర్శనకు అవకాశమివ్వడంలో, పోటీని పోటీగాకాక అర్థవంతంగా నిర్వహించడంలో బాసు తీరు అనన్య సామాన్యం.
అక్టోబర్ 25న ప్రారంభమైన బాలగాంధర్వం కార్యక్రమం గురించి గతంలో ప్రస్తావించాం. ఆ పోటీ ఇప్పుడు ఫైన్లల్స్ దశకు చేరుకుంది. తెలుగు పాటకు గాయనీగాయకుల పరంగా భావికి లోటు లేదని ఋజువు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం అంజనీ నిఖిల, రాఘవేంద్ర, లక్ష్మీ మేఘన, గణేశ్ రేవంత్ ల మధ్య గట్టి పోటీ అద్భుతంగా జరుగుతోంది. ఆ ఫైనల్స్ లో ఇంతవరకూ జరిగిన మొదటి, రెండవ భాగాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. గుంటూరులో జరుగుతున్న ఈ ఫైనల్స్ మరికొన్ని వారాలు కొనసాగవచ్చు. ప్రతి సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఈటివిలో వస్తున్న ఈ కార్యక్రమం సంగీత ప్రియులందరూ తప్పక చూడాల్సినది. అన్ని భాగాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version