ఏప్రిల్ 13, 2011
హాసం-ఇతిహాసం-గరికపాటి
తెలుగు గొప్పతనాన్ని గురించి తరచుగా వింటూంటాం, చెప్పుకుంటూంటాం. కవి పండితుల ప్రసంగ సభలలో తెలుగు గొప్పతనం ప్రత్యక్ష దర్శనమిస్తుంది. అలాంటి కవి పండితుల్లో బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గరిమ ఇప్పటికే మీడియాలో ప్రాచుర్యం సంతరించుకుంది. ఇటీవలే మా సాకేత్ కాలనీలో వారి అష్టావధానం కార్యక్రమం చూసే మహద్భాగ్యం మాకు కలిగింది. ఆ వివరాలు సంక్షిప్తంగా త్వరలో మీ ముందుంచగలం. ఈ ఏప్రిల్ 28న- హైదరాబాదు ఏయస్ రావు నగర్లో- మన ఇతిహాసాల్లో హాస్యరసంపై శ్రీ గరికపాటి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినగోరినవారు వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
puttaparthi anuradha said,
ఏప్రిల్ 13, 2011 at 11:14 ఉద.
గరికపాటి నరసిం హరావ్ గారు ద్విగుణిత అవధానంతో కలిపి 150 అవధానాలు చేసారు.అవధాన శారద,ధారణ బ్రహ్మ రాక్షస వంటి బిరుదులెన్నో పొందారు.యం.ఫిల్.లో యూనివర్సిటీ ఫస్ట్ వీరు. యన్.టి.రామారావ్ గారిచే గోల్డ్ మెడల్ అందుకున్న ప్రతిభాశాలి.