ఏప్రిల్ 26, 2011

యాది- పుస్తక పరిచయం

Posted in పుస్తకాలు at 4:48 సా. by వసుంధర

పరిచయవ్యాఖ్య : శ్రీ ఎస్‌. సదాశివ కవి, పండితుడు, కథకుడు, సంగీతజ్ఞుడు, బహుభాషా ప్రవీణులు, ఉపాధ్యాయుడు- మీదుమిక్కిలి మానవతావాది. మనమారాధించే వ్యక్తిత్వాలచేత ఆరాధించబడ్డ ప్రతిభాశాలి. ఆర్ధికంగా, సాహితీపరంగా- తనను శిఖరాగ్రాలకు చేర్చగల పరిచయాలకు స్నేహభావాన్ని చెలియలికట్ట చేసిన మహనీయుడు. ఆయన అనుభవాలూ, జ్ఞాపకాలూ- కథలు కాని, కథల్ని మించిన కథలు. అవాయన చెప్పగా వినడం పాఠకుల అదృష్టం.

పరిచయం : రూపాయ బిళ్లకోసం నా జేబులోని పావలా బిళ్లను పారేసుకోనన్న పండిట్‌ జస్‌రాజ్‌తో ఆరంభమైన- సదాశివ ‘యాది’లో గత శతాబ్దపు స్వతంత్ర సమరంనుంచి ఈ శతాబ్దపు ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకూ- ఒకటా రెండా- ఎన్నో మరపురాని వ్యక్తిత్వాలు, అపూర్వ సంఘటనలు. సంగీతసాధనలో, యోగసాధనలో అంతగా తేడా లేదనే ప్రభా ఆత్రే కచేరీ, సైగల్‌కి గురువు కాని గురువు ఉస్తాద్‌ ఫయ్యాజ్‌ఖాన్‌- ఇంకా అలాంటి ఎందరివో యాదులు- సంగీతశిక్షణనిస్తూ సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లి సంగీతాస్వాదన నేర్పుతాయి. ఉర్దూని అమితంగా అభిమానించే సదాశివ- యాదిలో వినిపించిన రుబాయీలు, షేర్లు- ఉర్దూకి సలాం చేయిస్తాయి. ఈ భారతీయ భాషని ముస్లిముల భాషగా భావించే తీరుపట్ల ఆవేదనని హృద్యంగా వ్యక్తపరిచిన ఆయన- తెలుగులో తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ, వేలూరి, కాళోజీ సోదరులు, సురవరం, సినారె, మధురాంతకం ప్రభృతుల ప్రాభవాన్ని సందర్భానుసారంగా ప్రస్తావించారు………

……యాది స్వీయచరిత్ర కాదు. స్వీయానుభవాలతో జాతి చరిత్ర. యాదిలో ఈషణ్మాత్రం స్వోత్కర్ష లేదు. కానీ సహృదయులైన పాఠకులకు సదాశివని మహామనీషిగా పరిచయం చేస్తుంది…….

చదివి తీరాల్సిన ఈ పుస్తకానికి పూర్తి పరిచయం రచన ఫిబ్రవరి (2011) సంచికలో లభిస్తుంది. లేదా ఇక్కడ క్లిక్ చెయ్యండి.

1 వ్యాఖ్య »

  1. saamaanyudu said,

    manchi maneeshi parichayam.. thanq..


Leave a Reply

%d bloggers like this: