మే 8, 2011
అమ్మకు ఓ రోజా!?
ఆవేదనలో- కలడు కలండనెడివాడు కలడో లేడో- అన్నప్పటికీ- ఇందుగలడందు లేడను సందేహము వలదు- అని తేల్చేశాడు పోతనామాత్యుడు. ప్రత్యక్ష దైవాలైన తలిదండ్రులపట్ల ఆ సందిగ్ధం కూడా లేదు. వారు మనని శిక్షీస్తే అది పరీక్ష. మనని మనోవ్యథకి గురి చేస్తే అది లీల. సృష్టి స్థితికే తప్ప లయకు కారకులు కాని అపురూప దైవత్వం వారిది. ఉన్నా లేకున్నా అనునిత్యం వారి స్మరణ మన కర్తవ్యం. వారిని స్మరించుకుందుకు ఏడాదికో రోజా? అదీ విడివిడిగానా? ఆధునికత మనకి నేర్పుతున్నదిదా?
అమ్మా నాన్నలిద్దరూ దైవాలే ఐనా- దైవత్వంలో అమ్మ ప్రత్యేకతని నాన్నలు కూడా ఒప్పుకుంటారు. అలంటి అమ్మకి రోజుకో రోజా- భక్తి ప్రేమ గౌర్వ ఆత్మీయ అభిమానాలతో- సమర్పించుకుందాం. ఏడాదికో రోజా…. వద్దు, వద్దు, వద్దు అందాం. మీరేమంటారు?
ఫ్లాట్ ఫోరం లో మా స్పందనకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
puttaparthianuradha said,
మే 9, 2011 at 5:19 సా.
యేం రోజాలో బాబూ.. సినీ నటి రోజాని చూసి..చూసి..రోజా అనగానే..పూలు కాకుండా ముళ్ళే..గుర్తుకొస్తున్నాయ్ నాకైతే..
అమ్మకు మనం రోజాలిచ్చినా ..ఇవ్వక పోయినా ఏ డేలు జరిపినా జరపక పోయినా..అమ్మ పట్టించుకోదు..
నేనైతే మా పిల్లలకు నేను ఏమైనా చెప్పిన వెంటనే నా మాట వినండి చాలు .. అదే నాకు మీరు డేలు జరిపినంత పుణ్యం అన్నా..
వేణు said,
మే 9, 2011 at 12:13 ఉద.
శీర్షిక చూసి, రోజా అంటే ‘గులాబి పువ్వు’ అనుకున్నా.:) కానీ అది రోజు అని అర్థమైంది చదువుతుంటే! ఈ ‘డే’లన్నీఆధునిక వ్యాపార సంస్కృతినుంచి పుట్టుకొచ్చినవే! వీటి ప్రభావానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.