మే 19, 2011

బహుమతి కథల విశ్లేషణ

Posted in కథల పోటీలు at 10:41 ఉద. by వసుంధర

సంపుటి వెబ్ పత్రిక నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథల విశ్లేషణ రచన మాసపత్రిక జూన్ సంచికలో వస్తుంది.
ఆ కథలపై మీ విశ్లేషణకోసం ఇక్కడ లంకెలు ఇస్తున్నాం.
అప్రాచ్యం        అయ్యో పాపం         పూడని వెలితి             అలిగితివా సఖీ ప్రియా  
ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథల విశ్లేషణ రచన మాసపత్రిక జూలై సంచికలో వస్తుంది.
ఆ కథలపై మీ విశ్లేషణకోసం ఇక్కడ లంకెలు ఇస్తున్నాం.
పెళ్లికళ      దారి తెలిసింది      గమ్యం దిశగా         ముడుతలు     ఇదే ఇదే శివుడంటే 

5 వ్యాఖ్యలు »

  1. Srinivas said,

    లంకెలిచ్చినందుకు ధన్యవాదాలు. కారణాలు వివరించే వోపిక లేదు గానీ కథలన్నీ నిరాశపరిచాయి, మీ కథతో సహా.

  2. Sivakumara Sarma said,

    “దారి తెలిసింది” గూర్చి –
    ఉపన్యాసా లిచ్చేకంటే తనవంతు సంఘసేవ చెయ్యడం మంచిదనే సందేశం చుట్టూ అల్లబడ్డ కథ ఇది. రఘురాం రాష్ట్రమంతా తిరుగుతూ ఉపన్యాసాలిస్తూంటాడు. ఏ.సి. కోచ్ లో రైలు ప్రయాణాని కలవాటుబడ్డ అతను అనివార్య కారణాలవల్ల ఒకరోజు సెకండ్ క్లాస్ స్లీపర్ బోగీలో ప్రయాణించడం వల్ల ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ రైల్లో పాటలు పాడుతూ యాచించే ఒక పది-పన్నేండేళ్ళ పిల్ల వల్ల ఆ పిల్లనే కాక ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూన్న ఇంకొందరు అనాథ పిల్లలను చేరదీసిన “దేవుణ్ణి” కలుస్తాడు. ఆ “దేవుడు” వల్ల ప్రభావితుడైన రఘురాం ఇక తను ప్రసంగాలవల్ల సంపాదించే డబ్బును ఆ దేవుడికే ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. కొన్ని కథలు ముగింపును ముందే పాఠకునికి తెలిపేస్తాయి. అలాంటి కథల్లో కథనం ముఖ్యమవుతుంది. (Mark Twain రాసిన The Private History of a Campaign That Failed కథనానికి చాలా పెద్ద పీట వేసిన కథ; ముందే ముగింపును ఊహించినా, చివరిదాకా పాఠకుణ్ణి పుస్తకం దింపనివ్వకుండా చదివింప జేస్తుంది.) సందేశం అంతర్లీనంగా కాక బహిరంగంగా వుండి, కథనం లోపించిన కథలు మూసకథలుగా పేరుపొందుతాయి. ఆ త్రోవలో సాగిన కథ ఇది. పోతే, కథకు సంబంధంలేని చిన్న ముఖ్యాంశం – “వరవీణా మృదుపాణీ” అనేది కీర్తన కాదు; కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్పేటప్పుడు మొదట్లో నేర్పే పిళ్ళయార్ గీతం.
    ఈ కథలకు లింకు లిచ్చినందుకూ, విశ్లేషణ తెలియజెయ్యడానికి అవకాశాన్నిచ్చినందుకూ వసుంధర గారికి ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: