మే 19, 2011

యండమూరితో మనసు విప్పి

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 2:26 సా. by వసుంధర

టివి ఛానెల్ ఎబిఎన్ ఆంధ్ర్యజ్యోతి లో వార్తలు, కార్యక్రమాలు- ఆసక్తికరంగా, విభిన్నంగా ఉంటాయి. వాటిలో ప్రముఖ పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న యంగిస్థాన్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె చెప్పుకోతగ్గవి. యంగిస్థాన్ పై మీ స్పందన ఆశిస్తున్నాం.
ఇక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె గురించి: ఈ కార్యక్రమంలో- రాధాకృష్ణ అనుసరిస్తున్న తనదైన తీరు- సూత్రధారులందరికీ ఆదర్శం. శాంతంగా ఎదుటివారిని రెచ్చగొట్టడం, ఎదుటివారు తనని రెచ్చగొడితే ప్రశాంతంగా ఉండడం, హాస్య-వ్యంగ్య-సత్యాన్వేషణలకు ప్రాధన్యమిస్తూనే సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించడం- అరుదైన ప్రతిభ. ఆయన చిరునవ్వు ఎన్నో భావాల్ని పలికిస్తుంది. ఇటీవల ఆయనకీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కీ జరిగిన ముఖాముఖీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దానిపై మా స్పందన రచన మాసపత్రిక జూన్ సంచికలో రానున్నది.  ఆతర్వాత అక్షరజాలంలోనూ ఇవ్వగలం. మీ స్పందనకై ఇక్కడ లంకె ఇస్తున్నాం.

2 వ్యాఖ్యలు »

  1. aprna said,

    yes i like this program

  2. tolakari said,

    నిజమేనండి. ఆ ఇంటర్వ్యూ లో మా లాంటి సామాన్యులకు సందేహాలుగా వున్నా అనేక విషయాలకు విడమరిచి సమాధానాలు చెప్పారు.


Leave a Reply

%d bloggers like this: